ENGLISH

బ‌న్నీకి 35... సుక్కూకి 25... ఎవ్వ‌రూ త‌గ్గేదే లే!

08 April 2021-13:54 PM

తెలుగులో తెర‌కెక్కుతున్న మ‌రో పాన్ ఇండియా సినిమా.... పుష్ష‌. ఈ సినిమా బ‌డ్జెట్ కూడా భారీగానే ఉంది. దాదాపుగా 160 కోట్ల బ‌డ్జెట్ తో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంద‌ని స‌మాచారం. ఈ సినిమాకి అల్లు అర్జున్‌కి ఏకంగా 35 కోట్ల రూపాయ‌లు పారితోషికం ఇస్తున్నార్ట‌. అదీ కాక‌... లాభాల్లో వాటా కూడా ఉంది. 160 కోట్ల బ‌డ్జెట్ కాబ‌ట్టి, 200 కోట్ల వ్యాపారం జ‌రిగితే... ఆ 40 కోట్ల‌లో బ‌న్నీకి వాటా ఇవ్వాలి.

 

సుకుమార్ కీ దాదాపుగా ఇంతే. ఈ సినిమాకి గానూ త‌న పారితోషికం 25 కోట్ల‌ని తేలింది. దాంతో పాటు లాభాల్లో వాటా కూడా ఉంది. పాన్ ఇండియా సినిమా కాబ‌ట్టి.. త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ సినిమాకి మంచి మార్కెట్ జ‌రిగే అవ‌కాశం ఉంది. ఎటు చూసినా.. పుష్ష టార్గెట్ 200 కోట్లు. అప్పుడు గానీ నిర్మాత‌ల‌కు వ‌ర్క‌వుట్ అవ్వ‌దు. బ‌న్నీ పుట్టిన రోజు సంద‌ర్భంగా టీజ‌ర్ వ‌చ్చింది. టీజ‌ర్‌కి వ‌స్తున్న స్పంద‌న చూసి చిత్ర‌బృందం సంతోషం వ్య‌క్తం చేస్తోంది. ఇది కేవ‌లం టీజ‌రే. సినిమా ఇంకెలా ఉంటుందో?

ALSO READ: RRR .. పుష్ష‌.. రెండూ అనుకున్న డేట్ కి రావ‌డం లేదా?