ENGLISH

RRR .. పుష్ష‌.. రెండూ అనుకున్న డేట్ కి రావ‌డం లేదా?

08 April 2021-12:00 PM

రిలీజ్ డేట్ విష‌యంలో ప‌క్కాగా ఉండాలి. అనుకున్న స‌మ‌యానికి సినిమా తీసుకురావాలి. ఇదే నిజంగా నిర్మాత‌ల‌కు పెద్ద టాస్క్‌. ఇప్పుడున్న స‌మ‌యంలో మ‌రింత క‌ష్టం. ఎందుకంటే... కోవిడ్ క‌ష్టాలు కొన‌సాగుతున్నాయి. షూటింగులు అనుకున్న స‌మ‌యానికి పూర్త‌వ‌డం లేదు. ఏదో ఓ స‌మ‌స్య‌. పెద్ద సినిమాల‌కైతే మ‌రీనూ. అందుకే రిలీజ్ డేట్లు తారు మారు అవుతున్నాయి. పుష్ష‌, ఆర్‌.ఆర్‌.ఆర్‌.. సినిమా విడుద‌ల తేదీలూ మారే అవ‌కాశం ఉంద‌ని, రెండూ అనుకున్న స‌మ‌యానికి విడుదల అయ్యే ఛాన్సు లేద‌న్న‌ది లేటెస్ట్ టాక్‌.

 

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కించిన చిత్రం `పుష్ష‌`. ఆగ‌స్టు 13న రావాల్సిన సినిమా ఇది. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుద‌ల వాయిదా ప‌డే అవ‌కాశం ఉంద‌ని టాక్‌. అంతే కాదు... ఆర్‌.ఆర్‌.ఆర్ కూడా వాయిదా ప‌డ‌బోతోంద‌ట‌. అక్టోబ‌రు 13న ఈ సినిమా రావాల్సివుంది. చిత్ర‌బృందం ఇప్ప‌టికీ అదే చెబుతోంది. కానీ.. ఆ స‌మ‌యానికి ఆర్‌.ఆర్‌.ఆర్ వ‌చ్చే ఛాన్సు లేద‌ని తెలుస్తోంది. ఆర్‌.ఆర్‌.ఆర్‌.. వాయిదా ప‌డితే, అక్టోబ‌రు 13న రావొచ్చ‌న్న‌ది పుష్ష ప్లాన్‌. ఆర్‌.ఆర్‌.ఆర్‌... మెల్ల‌గా సంక్రాంతికి షిఫ్ట్ అయిపోతుందేమో అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఆర్‌.ఆర్‌.ఆర్‌... రిలీజ్ డేట్ పై ఓ స్పష్ట‌త వ‌స్తే త‌ప్ప‌.. పుష్ష కొత్త డేట్ ఏమిట‌న్న‌ది తేల‌దు.

ALSO READ: ఏజెంట్ అద‌ర‌గొట్టేశాడు