ఒంటరి మహిళల్ని సమాజం చూసే దృష్టి కోణం వేరుగా ఉంటుంది. వాళ్లు సొంతంగా ఎదగలేరన్నది చాలామంది అపోహ. దాన్ని తప్పు అని నిరూపించడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. అందులో సెలబ్రెటీలూ ఉన్నారు. అమలాపాల్ ఆ కోవకే చెందుతుంది. దర్శకుడు విజయ్ ని ప్రేమించి పెళ్లిచేసుకుని, అనతి కాలంలోనే విడాకులు తీసుకుంది అమలాపాల్. ఆసమయంలో తను చాలా మానసిక ఆందోళనకు గురైందట.
ఒంటరిగా ఉంటే, ఎదగలేవు, అందరూ తప్పుడు దృష్టితో చూస్తారు అని చుట్టుపక్కల వాళ్లు, స్నేహితులు, బంధువులూ భయపెట్టేరట. అయినా సరే, తాను నిర్ణయం తీసుకోగలిగానని అంటోంది. ``జీవితంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎవరి మాటలూ వినకూడదు. మనసు చెప్పిందే చేయాలంతే. ఒంటరిగా ఉంటే.. ఎదగలేమన్నవాళ్లకు నేను సమాధానంగా మారాలనుకున్నా. అందుకే ఇప్పుడు సినిమాలపై మరింతగా దృష్టి పెట్టా`` అంటోంది అమలాపాల్.
ALSO READ: Amala Paul Latest Photoshoot