ENGLISH

యాక్షన్‌ మోడ్‌లో డస్కీ బ్యూటీ

09 March 2018-09:30 AM

'నాయక్‌', 'ఇద్దరమ్మాయిలతో', 'లవ్‌ ఫెయిల్యూర్‌' తదితర తెలుగు చిత్రాల్లో నటించిన ముద్దుగుమ్మ అమలాపాల్‌ ప్రస్తుతం తమిళ, మలయాల చిత్రాలతో బిజీగా గడుపుతోంది. ఉమెన్స్‌ డే సందర్భంగా తమిళంలో అమలాపాల్‌ నటిస్తున్న 'అదో అందా పరవై పోలా' చిత్రం ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. ఆర్‌. వినోద్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 

మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని అందాల చందమామ కాజల్‌ అగర్వాల్‌ చేతుల మీదుగా విడుదల చేయించారు. ఫస్ట్‌లుక్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈ లుక్‌లో అమలాపాల్‌ ముఖంపై కత్తి ఘాటుతో డిఫరెంట్‌ ఎక్స్‌ప్రెషన్‌తో కనిపిస్తోంది. ఈ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని విడుదల చేసినందుకు కాజల్‌కి థాంక్స్‌ చెబుతూ, అమలాపాల్‌ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టింది. కాజల్‌కి బాహ్య సౌందర్యమే కాదు, అంతర్గత సౌందర్యం కూడా ఉన్నందుకు మెచ్చుకోవాలనీ, అలాగే 'షి ఈజ్‌ గ్రేట్‌ లేడీ, అండ్‌ సో బ్యూటిఫుల్‌' అని ట్వీట్‌ చేసింది. అంతేకాదు ఉమెన్స్‌ డే రోజు సాటి మహిళగా కాజల్‌ తన సినిమా పోస్టర్‌ని విడుదల చేసినందుకు చాలా గర్వంగా ఉందనీ అమలాపాల్‌ చెప్పింది. 

కాగా ఈ తాజా చిత్రం ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఇంతవరకూ తాను ఎప్పుడూ పోషించని సరికొత్త పాత్రలో అమలాపాల్‌ కనిపించనుందట. ఇలాంటి పాత్రలో నటించడం ఛాలెంజింగ్‌గా ఉందని చెబుతోంది అమలాపాల్‌. ఇదిలా ఉంటే, భర్తతో బ్రేక్‌ అప్‌ అయ్యాక అమలాపాల్‌ గ్లామర్‌ డోస్‌ బాగా పెంచేసింది. అలాగే సినిమాల జోరు కూడా పెంచేసింది. తెలుగు మినహాయిస్తే, తమిళ, మలయాళంలో వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తోంది.

ALSO READ: వైఎస్ఆర్ భార్యగా లేడీ సూపర్ స్టార్!