ENGLISH

సైలెంట్‌గా జోరు పెంచుతోన్న బ్యూటీ

09 March 2018-08:30 AM

'అజ్ఞాతవాసి' దెబ్బతో అనూ ఇమ్మాన్యుయేల్‌ పనైపోయిందనుకున్నారంతా. కానీ అలా ఏం జరగలేదు. సైలెంట్‌గా ఆఫర్లు దక్కించుకుంటోందీ బ్యూటీ. తాజాగా మాస్‌ రాజా రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రంలో హీరోయిన్‌గా అనూ ఇమ్మాన్యుయేల్‌ ఛాన్స్‌ కొట్టేసింది. 'అమర్‌ అక్బర్‌ ఆంటోనీ' అనే టైటిల్‌ని ఈ సినిమాకి పరిశీలిస్తున్నారు. శీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ రోజే లాంఛనంగా ప్రారంభమైంది.

శ్రీను వైట్ల - రవితేజ కాంబినేషన్‌ అంటే అంచనాలుంటాయి. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో 'వెంకీ', 'దుబాయ్‌ శీను' తదితర హిట్‌ చిత్రాలున్నాయి. సో లాంగ్‌ గ్యాప్‌ తర్వాత రిపీట్‌ అవుతోన్న ఈ కాంబినేషన్‌పై అంచనాలు నెలకొనడం సహజమే. శీనువైట్లకి ఈ మధ్య సరైన హిట్‌ లేక సతమతమవుతున్నాడు. సో కరెక్ట్‌ టైంలో తన హిట్‌ ఫార్ములాతో, తనకి లక్కీ హీరో అయిన మాస్‌ రాజా రవితేజతో ఈ తాజా చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడన్న మాట. మరో పక్క 'రాజా ది గ్రేట్‌' సినిమాతో లాంగ్‌ గ్యాప్‌ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన రవితేజకి కూడా ఇదివరకటి స్థాయిలో ఓ మంచి మాస్‌ మసాలా హిట్‌ కావల్సి ఉంది. 

అందుకే ఈ ఇద్దరూ ఇప్పుడు కరెక్ట్‌గా కాన్‌సన్‌ట్రేషన్‌ చేసి ఈ ప్రాజెక్ట్‌ని టేకప్‌ చేశారట. వీరు ఇంతగా కాన్‌సన్‌ట్రేషన్‌ చేశారంటే ఖచ్చితంగా హిట్‌ కొట్టడం పక్కా. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్‌కి చోటుంది. అందులో ఒక హీరోయిన్‌గా అనూ ఇమ్మాన్యుయేల్‌ని ఎంచుకున్నారు. ఈ ఆఫర్‌ అనూకి కూడా బంపర్‌ ఆఫరే అని చెప్పాలి. ఎందుకంటే, ప్రస్తుతం అను ఉన్న పరిస్థితుల్లో అంచనాలున్న సినిమాల్లో ఛాన్స్‌ దక్కించుకోవడం అంటే చిన్న విషయం కాదు మరి. 

ఈ సంగతిటుంచితే, అనూ నటించిన 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' మేలో విడుదలకు సిద్ధంగా ఉంది. మరో పక్క మారుతి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతోన్న 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రంలోనూ అనూ ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

ALSO READ: వైఎస్ఆర్ భార్యగా లేడీ సూపర్ స్టార్!