ENGLISH

కామెడీ ఎక్స్‌ప్రెస్‌లోకి సునీల్‌ షిఫ్టయిపోయినట్టేనా?

09 March 2018-07:30 AM

కమెడియన్‌గా సునీల్‌కి వీరాభిమానులే ఉంటారు. అదే వీరాభిమానం ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా కొంతవరకూ పని చేసింది. ఆ వీరాభిమానంతోనే హీరోగా సునీల్‌ సినిమాలను మొదట్లో అభిమానులు ఆదరించారు. అయితే ఆ తర్వాత ఎందుకో హీరోగా సునీల్‌ని ఏక్‌సెప్ట్‌ చేయడం మానేశారు అభిమానులు. అందుకు సునీల్‌ ఎంచుకున్న కథలే కారణమనీ ఓ టాక్‌ కూడా ఉంది. 

సునీల్‌ అంటే ఎంటర్‌టైన్‌మెంట్‌. రాను రాను సునీల్‌ సినిమాల్లో ఉండాల్సిన ఆ ఎంటర్‌టైన్‌మెంట్‌ కంటెన్ట్‌ లోపించడం వల్లనో ఏమో హీరోగా రేసులో సునీల్‌ చాలా వెనకబడిపోయాడు. దాంతో సునీల్‌ని అభిమానులు పూర్తిగా మర్చిపోక ముందే మేల్కొన్నాడు. అభిమానులు తనని ఎలా ఇష్టపడతారో ఆ అవతారమే ఎత్తాలనీ డిసైడ్‌ అయ్యాడట. దాంతో కమెడియన్‌ పాత్రలకు మళ్లీ తెర లేపాడు. దాంతో వరుసగా సునీల్‌ కోసం తమ తమ సినిమాల్లో కొత్తకొత్త కామెడీ లెంగ్త్‌ రోల్స్‌ని ప్రిపేర్‌ చేసేసుకుంటున్నారు దర్శకులు. 

ఆల్రెడీ సునీల్‌, అల్లరి నరేష్‌ హీరోగా నటిస్తున్న సినిమాలో ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ రోల్‌ పోషిస్తున్నాడు. ఓ రకంగా ఇది సునీల్‌ - నరేష్‌ మల్టీ స్టారర్‌గా భావించాలి. అలాగే మరో ఇద్దరు యంగ్‌హీరోల సినిమాల్లో సునీల్‌ కోసం కామెడీ స్క్రిప్టులు రెడీ అయ్యాయట. తాజాగా రవితేజ నటిస్తున్న 'అమర్‌ అక్బర్‌ ఆంటోనీ' సినిమాలో సునీల్‌కి ఓ మంచి క్యారెక్టర్‌ని ప్రిపేర్‌ చేశారట. శీను వైట్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉండగా, చిరంజీవి అంటే సునీల్‌కి ఎంత ఇష్టమో తెలిసిందే. అందుకే చిరంజీవి 150వ సినిమాలో సునీల్‌కి నటించే ఛాన్స్‌ వచ్చింది కానీ అప్పట్లో సునీల్‌కి డేట్స్‌ అడ్జస్ట్‌ కాని కారణంగా ఆ ఛాన్స్‌ మిస్‌ చేసుకున్నాడు. 

అయితే, 151వ సినిమాలో సునీల్‌ చేద్దామనుకున్నా, సినిమా జోనర్‌ డిఫరెంట్‌గా వుండడం, సునీల్‌కి తగ్గ పాత్ర లేకపోవడంతో, చిరంజీవే సునీల్‌కి ఆ విషయం స్వయంగా చెప్పాడట. సునీల్‌ స్వయంగా ఈ విషయాన్ని చెప్పాడు. మొత్తానికి మళ్లీ సునీల్‌ కమెడియన్‌ అవతారమెత్తడమనేది, అతని అభిమానులకు ఆనందించదగ్గ విషయమే.

ALSO READ: వైఎస్ఆర్ భార్యగా లేడీ సూపర్ స్టార్!