ENGLISH

మత్తెక్కించే గ్లామర్‌తో 'లేడీ రోబో' దాడి

16 June 2018-17:02 PM

అందాల అమీజాక్సన్‌కి అందంతో పాటు, హాట్‌నెస్‌ కూడా చాలా ఎక్కువే. అవకాశం దొరికితేనే అందగత్తెలు హాట్‌నెస్‌తో రెచ్చిపోతూ ఉంటారు. కానీ లక్కీగా ఈ ముద్దుగుమ్మకి దొరికే అవకాశాలన్నీ, గ్లామరస్‌ పాత్రలే కావడం విశేషం. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తన గ్లామర్‌ తళుకు బెళుకులతో బోలెడంత ఫాలోయింగ్‌ పెంచుకుందీ బ్యూటీ. ఆకట్టుకునే ఫిజిక్‌ అమ్మడి గ్లామర్‌ని మరింత ఎలివేట్‌ చేసేలా ఉంటుంది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో ఈ హాట్‌ బ్యూటీ నటిస్తున్న 'రోబో 2.0' చిత్రం విడుదలకు సిద్ధమై చాలా కాలమే అయ్యింది. కానీ వరుస వాయిదాలతో ఎప్పుడొస్తుందో తెలీని పరిస్థితిలో ఉంది. అందుకే జనం తనని గుర్తుంచుకోవాలనే ఉద్దేశ్యంతో ఇదిగో ఇలా సోషల్‌ మీడియాలో విచ్చల విడి గ్లామర్‌ షో చేసేస్తుంటుంది. ఒంటిపై డ్రస్సు ఉందా లేదా? అనే అనుమానం కలిగేలా ఈ ముద్దుగుమ్మ ధరించిన ఈ చెమ్కీ డ్రస్సులో ఆమె అందాలను మత్తెక్కిస్తున్నాయిగా.

ALSO READ: నా నువ్వే మొదటి రోజు కలెక్షన్లు తెలిస్తే షాక్ అవుతారు