ENGLISH

ఫ్లాప్ హీరో సినిమా... ఇంత రేటా..?

16 November 2020-10:09 AM

టాలీవుడ్ లో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు... విజ‌య్ దేవ‌ర‌కొండ‌. త‌న త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ కూడా... హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు. దొర‌సాని సినిమాతో. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. విజ‌య్ దేవ‌ర‌కొండ ఇమేజ్‌, త‌న స్టార్ డ‌మ్.. త‌మ్ముడికి ఏమాత్రం హెల్ప్ కాలేదు. విజ‌య్ స్టార్ గా ఎదిగిపోతే... ఆనంద్ ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాడు. త‌న కెరీర్ రాబోతున్న `మిడిల్ క్లాస్ మెలోడీస్‌` సినిమా ఫ‌లితంపై ఆధార ప‌డి వుంది. ఆనంద్ న‌టించిన రెండో సినిమా ఇది.

 

ఈనెల 20న అమేజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతోంది. ఈసినిమా ని అమేజాన్ వాళ్లు ఏకంగా 4.5 కోట్లు పెట్టి కొన్నార్ట‌. కేవ‌లం.. ఓటీటీ రూపంలోనే సినిమా బ‌డ్జెట్ కి రెండింత‌లు వ‌చ్చిన‌ట్టైంది. తొలి సినిమా `దొర‌సాని` ఫ్లాప్ అయినా.. రెండో సినిమాకి అందులోనూ ఓటీటీలో విడుద‌ల అవుతున్న సినిమాకి ఇంత రేటు రావ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. అమేజాన్ ప్ర‌తినిథులు ఈ సినిమా ముందే చూశార‌ని, సినిమా న‌చ్చ‌డం వ‌ల్ల అంత రేటు ఇచ్చార‌ని ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగా వుంది. పాట‌లూ బాగున్నాయి. సో.. ఆనంద్ ఈ సినిమాతో హిట్టు కొట్టే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి.

ALSO READ: గంట‌కు 15 ల‌క్ష‌లంటే త‌క్కువా..??