ENGLISH

గంట‌కు 15 ల‌క్ష‌లంటే త‌క్కువా..??

16 November 2020-09:05 AM

ఓటీటీ లోకి స‌మంత అడుగుపెట్టేసింది. 'ఆహా' కోసం సామ్ - జామ్ అనే టాక్ షో చేస్తోంది. తొలి ఎపిసోడ్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని తీసుకొచ్చింది. ఫ‌స్ట్ ఎపిసోడ్ తోనే.. స‌మంత అద‌ర‌గొట్టేసింది. ఈ షోకి స‌మంత పారితోషికం ఎంత తీసుకుంటోంది? అనే విష‌యంపై ర‌క‌ర‌కాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

 

ఈ షో కోసం స‌మంత ఒక్క ఎపిసోడ్ కోసం 15 ల‌క్ష‌లు ఛార్జ్ చేస్తోంద‌ని టాక్‌. స‌మంత ఇమేజ్‌కీ, రేంజ్‌కీ 15 ల‌క్ష‌లు చాలా త‌క్కువ‌ని, కేవ‌లం అల్లు అర‌వింద్ ని చూసి, మొహ‌మాటం కొద్దీ ఒప్పుకుంద‌ని చెప్పుకుంటున్నారు. నిజానికి 15 ల‌క్ష‌లు చాలా ఎక్కువనే చెప్పాలి. ఒక్క ఎపిసోడ్ గంట‌కు అటూ ఇటూగా ఉంటుంది. మ‌హా అయితే ఒక పూట షూటింగ్‌. అందుకోసం 15 ల‌క్ష‌లంటే త‌క్కువ కాద‌నే చెప్పాలి. ఈ సీజ‌న్లో మొత్తం 12 ఎపిసోడ్లు ఉంటాయ‌ట‌. అంటే.. 1.80 కోట్లు ఆర్జించ‌బోతోంది. అంటే స‌మంత ఒక సినిమాకి తీసుకునే పారితోషికంతో స‌మానం. 12 ఎపిసోడ్లూ.. 12 రోజుల్లో తేలిపోతుంది. సినిమా అలా కాదు క‌దా. క‌నీసం 50 నుంచి 60 రోజుల కాల్షీట్లు కేటాయించాలి. ఆ లెక్క‌న‌.. ఇది పెద్ద పారితోషిక‌మే.

ALSO READ: Samantha Latest Photoshoot