ENGLISH

కరోనా డోన్ట్‌ కేర్‌: మాల్దీవుల్లో బికినీ గిలిగింతలు.!

31 December 2020-16:04 PM

కరోనా గిరోనా డోన్ట్‌ కేర్‌.. వెకేషన్‌ విషయంలో అస్సలేమాత్రం తగ్గడంలేదు సెలబ్రిటీలు. ఎవరేమన్నా అనుకోనీ, పెళ్ళయినవారే కాదు.. పెళ్ళి కాని వారు కూడా జంటలుగా మాల్దీవుల్లో పండగ చేసేసుకుంటున్నారు. న్యూ ఇయర్‌కి వెల్‌కమ్‌ చెప్పేందుకోసం చాలా బాలీవుడ్‌ జంటలు మాల్దీవుల్లో మకాం పెట్టేశాయి.

 

కొత్తగా పెళ్ళయిన జంటలే కాదు, 'ఎఫైర్లు నడుపుతోన్న' తారలూ మాల్దీవుల్లో మంట పుట్టించేస్తుండడం గమనించాల్సిన విషయమిక్కడ. కొందరేమో, విడివిడిగా వెళ్ళి, మాల్దీవుల్లో జంటగా ఎంజాయ్‌ చేస్తోంటే, ఇంకొందరు జంటగానే ఇక్కడి నుంచి వెళుతుండడం ఆసక్తికరమైన అంశం. బాలీవుడ్‌ యువ జంట అనన్య పాండే, ఇషాన్‌ ఖత్తర్‌, న్యూ ఇయర్‌ వెకేషన్‌ కోసం మాల్దీవులకు వెళ్ళడం చర్చనీయాంశంగా మారింది.

 

అనన్య పాండే అక్కడి నుంచే హాట్‌ హాట్‌ బికినీ పోజులతో సోషల్‌ మీడియాలో కిర్రాకు పుట్టించేస్తోంది. మరోపక్క కైరా అద్వానీ కూడా ప్రియుడు సిద్దార్ధ మల్హోత్రాతో మాల్దీవ్స్‌కి చెక్కేసిన విషయం విదితమే. ఇంతకీ, మాల్దీవుల్లో అంత 'హాట్‌ అండ్‌ స్పెషల్‌' ఏముందబ్బా.? అంటే, అక్కడ చాలా 'కిక్‌' వుందంటారు అక్కడికి వెళ్ళొచ్చినోళ్ళు. కన్నడ భామ శాన్వీ ఈ మధ్యన మాల్దీవులకు ఒంటరిగా వెళ్ళి, అక్కడ ఎంజాయ్‌ చేసొచ్చింది. కాజల్‌ అగర్వాల్‌, పెళ్ళి అయ్యాక తన భర్తతో కలిసి మాల్దీవుల్లో చక్కర్లు కొట్టి వచ్చింది. అన్నట్టు, సినీ జంటల ఫ్యామిలీ ట్రిప్స్‌ కూడా మాల్దీవుల్లోనే ఎక్కువగా జరుగుతుంటాయి. అక్కడ ఆ స్థాయి కిక్‌ అందరికీ దొరుకుతుంది మరి.!

ALSO READ: బాల‌య్య సినిమాకి ఎన్ని క‌ష్టాలో?