ENGLISH

అనూసూయతో పెట్టుకుంటే అంతే!

21 August 2017-15:58 PM

బుల్లితెర హొయలొలికిస్తున్న యాంకర్‌ అనసూయకి కోపమొచ్చిందట. బుల్లితెరపై విచ్చల విడిగా అందాలారబోస్తున్నావంటూ, కొంచెం హాట్‌నెస్‌ తగ్గించమనీ ఓ అభిమాని అనసూయని సోషల్‌ మీడియా ద్వారా కామెంట్‌ చేశాడట. ఆ కామెంట్‌కి చిర్రెత్తుకొచ్చిన ఈ బ్యూటీ యాంకర్‌ ఏం చేసిందో తెలుసా? అంత కన్నా ఘాటుగా రిప్లై ఇచ్చేసింది. నాకు అందం ఉంది. నేను అలా ఉండడం చాలా మందికి ఇష్టమే. చాలా మంది చూస్తున్నారు. నీ ఒక్కడి కోసం నేను నా ఆటిట్యూడ్‌ని మార్చుకోను. అంతగా నీకు ఇష్టం లేకపోతే నువ్వు చూడడం మానేయ్‌ అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టిందట. అందుకు ఆ అభిమాని ఖంగుతినక తప్పలేదు. గ్లామర్‌ ప్రపంచంలో ఉన్నప్పుడు అందాల ఆరబోత అనేది కామన్‌ థింగ్‌. అలా అని అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్త పరచడం కూడా తప్పేం కాదులెండి. అందులోనూ అనసూయతో పెట్టుకుంటే అంతే మరి. అనసూయకి హాట్‌నెస్‌ మాత్రమే కాదు. ఇలా హాట్‌గా స్పందించడమూ తెలుసు. చాలా సందర్భాల్లో ఇలాంటి కామెంట్స్‌ని అలాగే తిప్పి కొట్టింది అనసూయ. అందులోనూ ఈ బ్యూటీ అసలే బుల్లితెరపైనే కాదు, వెండితెరపైనా అందాలొలకబోస్తోంది. స్టార్‌ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది. ఈ మధ్యే మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కిన 'విన్నర్‌' సినిమాలో ఓ ఐటెం సాంగ్‌లో తళుక్కున మెరిసింది. లేటెస్టుగా మరో మెగా మూవీ 'రంగస్థలమ్‌'లోనూ అనసూయ నటిస్తోంది.

ALSO READ: జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన వేణుమాధవ్..!!