ENGLISH

స్పీడు పెంచబోతున్న తెలుగమ్మాయి

18 June 2018-11:50 AM

అంజలి హీరోయిన్‌గా నటించిన 'గీతాంజలి' చిత్రం ఆమెకు మంచి విజయాన్ని అందించింది. తెలుగులో హీరోయిన్‌గా మంచి పాత్రలతో పాటు, ఐటెం సాంగ్స్‌లోనూ మెరిసింది అంజలి. 'సరైనోడు' చిత్రంలో అల్లు అర్జున్‌తో స్పెషల్‌ సాంగ్‌లో ఆడి పాడింది. తమిళంలోనూ స్పెషల్‌ సాంగ్స్‌లో నటించింది కానీ, ఎప్పుడూ గ్లామర్‌ పరంగా హద్దులు దాటేయలేదు. 

అయితే ఇప్పుడు అంజలి మనసు మార్చుకుందట. కాస్త గ్లామర్‌ డోస్‌ పెంచనుందట. అంజలి హీరోయిన్‌గా నటించిన 'గీతాంజలి' చిత్రానికి సీక్వెల్‌ తెరకెక్కించబోతున్నారట. తొలి పార్ట్‌లో ట్రెడిషనల్‌గా కనిపించిన అంజలి, ఈ సినిమాలో చాలా హాట్‌గా కనిపించనుందని తెలుస్తోంది. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ ఫస్ట్‌లుక్‌లోనే బీభత్సమైన హాట్‌ అప్పీల్‌ ప్రదర్శించింది అంజలి. అంతేకాదు ఈ సినిమా మొత్తం ఫుల్‌ గ్లామరస్‌ లుక్‌లో అంజలి కనిపించబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. 

ఈ మధ్య కొంచెం బొద్దుగా మారిన అంజలి ఫుల్‌గా వర్కవుట్స్‌ చేసి, సన్నగా సన్నజాజి తీగలా మరింత అందంగా మారిపోయింది. అందుకే తన నాజూకు అందాల్ని తెరపై ప్రదర్శించేందుకు ప్రత్యేకంగా సిద్ధమవుతోందట. ఇకపోతే, ఈ సినిమాని, మొదటి పార్ట్‌ తెరకెక్కించిన డైరెక్టర్‌ కాకుండా, కొత్త డైరెక్టర్‌ తెరకెక్కించనున్నాడనీ తెలుస్తోంది. 

చూడాలి 'గీతాంజలి 2', 'గీతాంజలి' స్థాయిలో హిట్‌ అందుకుంటుందో లేదో. మరోవైపు అంజలి - లక్ష్మీరాయ్‌ కాంబినేషన్‌లో ఓ బైలింగ్వల్‌ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ALSO READ: నానీగారూ.. దుమ్ము దులిపేశారండోయ్‌!