ENGLISH

చైతూ 'సవ్యసాచి' ఇంకెప్పుడు.?

18 June 2018-11:43 AM

అక్కినేని బుల్లోడు నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం 'సవ్యసాచి'. చందూమొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. చైతూ - చందూ మొండేటి కాంబినేషన్‌ పరంగా ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'ప్రేమమ్‌' చైతూ కెరీర్‌లో బెస్ట్‌ ఫిలింగా పేరు తెచ్చుకుంది. 

ఇకపోతే తాజా చిత్రం 'సవ్యసాచి' కథ పరంగా కూడా అంచనాలు నమోదు చేస్తోంది. రెండు చేతులనూ సమర్ధవంతంగా ఉపయోగించగల కుర్రోడి పాత్రలో చైతూ నటిస్తున్నాడు. ఫస్ట్‌లుక్‌ పోస్టర్స్‌తో చాలా ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేశాడు చైతూ ఆల్రెడీ. ఇకపోతే ఈ సినిమాకి తమిళ హీరో మాధవన్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌ కానున్నాడు. మాధవన్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అది నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రనీ తెలుస్తోంది. మాధవన్‌ - చైతూ మధ్య వచ్చే సన్నివేశాలు ఆధ్యంతం ఆశక్తికరంగా ఉండబోతున్నాయట.  

పవర్‌ ఫుల్‌ కథా, కథనాలతో పాటు, అన్ని కమర్షియల్‌ హంగుల్నీ జోడించి చందూ మొండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. సినిమా ఔట్‌ పుట్‌ చాలా చాలా బాగా వస్తోందట. ఇటీవల నాని నటించిన 'ఎంసీఏ' చిత్రంలో నటించి మంచి విజయం అందుకున్న సీనియర్‌ నటి భూమిక అప్పియరెన్స్‌ మరో స్పెషల్‌ అట్రాక్షన్‌ ఈ సినిమాకి. అందాల భామ నిధి అగర్వాల్‌ ఈ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమవుతోంది. చైతూ - నిధి అగర్వాల్‌ పెయిర్‌ చూడ ముచ్చటగా ఆకట్టుకోనుందట. 

దాదాపు షూటింగ్‌ చివరి దశకు చేరుకుందని చిత్ర యూనిట్‌ ద్వారా అందుతోన్న సమాచారమ్‌. త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ALSO READ: నానీగారూ.. దుమ్ము దులిపేశారండోయ్‌!