ENGLISH

100 కోట్ల క్లబ్‌లోకి సల్మాన్‌ఖాన్‌ 'రేస్‌-3'

18 June 2018-11:37 AM

పరమ చెత్త సినిమా అనే విమర్శల్ని రివ్యూల ద్వారా ఎదుర్కొన్నప్పటికీ సల్మాన్‌ఖాన్‌ తాజా చిత్రం 'రేస్‌-3' కేవలం మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. ఈ ఘనత సాధించిన మూడో చిత్రంగా సల్మాన్‌ఖాన్‌ కెరీర్‌లో 'రేస్‌-3' ప్రత్యేకతను సంతరించుకుంది. శుక్రవారం (విడుదలైన రోజు) 29.17 కోట్లు సంపాదించిన 'రేస్‌-3', శనివారం అందరి అంచనాల్ని తల్లకిందులు చేస్తూ ఏకంగా 38.14 కోట్లు వసూలు చేసింది. 

మూడో రోజు ఆదివారం 'రేస్‌-3' ప్రభంజనం మరింతగా కొనసాగింది. 39.16 కోట్లు కొల్లగొట్టి ట్రేడ్‌ పండితులకే పెద్ద షాక్‌ ఇచ్చింది. అయితే 'ఈద్‌' నేపథ్యంలో 'రేస్‌-3' సినిమా వసూళ్ళ పంట పండించిందనీ, తొలి సోమవారం ఈ సినిమాకి అగ్ని పరీక్షేనని ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు. ఫ్లాప్‌ సినిమాలతో, ఓ మోస్తరు సినిమాలతో వసూళ్ళ ప్రభంజనం సృష్టించి, విమర్శకులకు షాకివ్వడం సల్మాన్‌ఖాన్‌కి కొత్తేమీ కాదు. అయినాగానీ, 'రేస్‌-3' సినిమాకి మరీ దారుణమైన రివ్యూలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 100 కోట్ల వసూళ్ళను దాటి ఈ సినిమా ఎంతవరకు ముందుకెళుతుందో చెప్పలేం. 

ఏదిఏమైనా సల్మాన్‌ఖాన్‌ ఖాతాలో మరో 100 కోట్ల సినిమా చేరడం అభినందనీయమే. ఈజీగా తమ అభిమాన హీరో సినిమా 200 కోట్లు దాటేస్తుందని, 300 కోట్ల మార్క్‌ అందుకుంటుందనీ సల్మాన్‌ఖాన్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో సవాల్‌ విసిరేస్తున్నారు. అది సాధ్యమయ్యే పనేనా? వేచి చూడాలిక.

 

ALSO READ: ట్రోలింగ్ పై స్పందించిన నాని