ENGLISH

నానీగారూ.. దుమ్ము దులిపేశారండోయ్‌!

18 June 2018-11:31 AM

ఏవండోయ్‌ నానీగారూ.. దుమ్ము దులిపేశారండీ..! 'బిగ్‌ బాస్‌' రియాల్టీ షో సీజన్‌ 2కి సంబంధించి బుల్లితెర వీక్షకుల నుంచి నానిపై కురుస్తున్న ప్రశంసల జల్లు ఇది. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌ చేసిన 'బిగ్‌ బాస్‌ సీజన్‌ వన్‌'ని పక్కన పెట్టి చూస్తే, బుల్లితెరపై నేచురల్‌ స్టార్‌ నాని సత్తా చాటేస్తున్నాడని నిస్సందేహంగా చెప్పొచ్చు. 

ఎన్టీఆర్‌తో నానిని పోల్చకూడదిక్కడ. ఎందుకంటే యంగ్‌ టైగర్‌ స్టార్‌డమ్‌ వేరు. నాని ఇమేజ్‌ వేరు. విషయ పరిజ్ఞానం విషయంలో యంగ్‌ టైగర్‌కి ఏమాత్రం తగ్గకుండా బిగ్‌ బాస్‌ రెండో సీజన్‌ని నాని నడిపిస్తున్న తీరుకి బుల్లితెర వీక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఇంకో వైపున కంటెస్టెంట్స్‌ కూడా రెండో సీజన్‌లో అదరగొట్టేస్తున్నారు. పేరున్న కంటెస్టెంట్ల కంటే, పెద్దగా పేరు లేని కంటెస్టెంట్లే బిగ్‌ బాస్‌లో సత్తా చాటుతున్నారనే అభిప్రాయాలు బుల్లితెర వీక్షకుల్లో వ్యక్తమవుతున్నాయి. పెద్దగా అంచనాలేమీ లేకపోవడంతో సీజన్‌ టూ కంటెస్టెంట్స్‌ అంచనాలకు మించి రాణిస్తున్నట్లుగా కన్పిస్తోంది. 

ఫస్ట్‌ వీక్‌ ఎలిమినేషన్‌ మాత్రం కొంత షాకింగ్‌గా అన్పించింది. షోలో హాట్‌ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సంజన అన్నె ఎలిమినేట్‌ అయ్యింది. దాంతో ఆమె అభిమానులు కొంత నిరాశ చెందారు. అంతకు ముందు వరకూ ఈమె ఎవరికీ తెలియదు. కానీ బిగ్‌ బాస్‌ రియాల్టీ షోతో సెలబ్రిటీ అయిపోయింది. 

ఇప్పుడిప్పుడే బిగ్‌బాస్‌ సీజన్‌ టూ మరింతగా జనాల్లోకి వెళ్ళిపోతోంది. హోస్ట్‌గా నానికి ఫుల్‌ మార్క్స్‌ పడిపోతున్నాయి. సీజన్‌ ఎండ్‌ అయ్యేసరికి నానిలో ఎనర్జీని పీక్స్‌లో చూసే అవకాశం వుంది.

ALSO READ: ట్రోలింగ్ పై స్పందించిన నాని