ENGLISH

వినూత్నంగా ఫాదర్స్ డే విషెస్ చెప్పిన విక్రమ్

17 June 2018-19:05 PM

ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా సామాన్యుడి దగ్గరి నుండి సూపర్ స్టార్స్ వరకు తమ తమ రియల్ హీరోస్ (ఫాదర్స్) గురించిన ఫోటోలని, మాటలని, వారితో ఉన్న అనుభవాలని తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పెడుతూ ఫాదర్స్ డే ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

అయితే ఇందుకు భిన్నంగా యువ నటుడు విక్రమ్ (నిర్మాత లగడపాటి శ్రీధర్ కొడుకు) తన తండ్రికి ఫాదర్స్ డే విషెస్ ని ఒక వీడియో రూపం లో చెప్పాడు. ఈ వీడియో లో కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉంది. తన తండ్రి చిన్నతనం నుండి తన జీవితాన్ని తీర్చిదిద్దడంలో ఎలాంటి పాత్ర పోషించాడు అలానే తనకి ఏదైనా ఇబ్బంది తలలెత్తి వాటి నుండి ఎలా బయటకిరావాలి అనే చెబుతూ తనని అనునిత్యం ఎలా ప్రోత్సహిస్తుంటారు అనేది వివరించాడు. ప్రస్తుతం ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది.

ఇక యువ నటుడు విక్రమ్ విషయానికి వస్తే, ఇప్పటికే పలు చిత్రాలలో తన నటనతో అందరిని మెప్పించడమే కాకుండా ఒక మంచి భవిష్యత్తు ఉన్న నటుడిగా పెరుతెచ్చుకోవడం కూడా గమనార్హం. త్వరలోనే విక్రమ్ హీరోగా వెండితెరకు పరిచయం అవుతాడు అని ఫిలిం నగర్ లో ఒక వార్త హల్చల్ చేస్తున్నది. 

ఈ సందర్భంగా ఆయనకి మా తరపు నుండి బెస్ట్ విషెస్..

ALSO READ: Qlik Here For Vikram's Father's Day Wishes Video