ENGLISH

Anu Emmanuel: అను ఇమ్మానియేల్ ల‌వ్‌... శిరీష్‌తోనేనా..?

05 November 2022-14:00 PM

అల్లుశిరీష్ - అను ఇమ్మానియేల్ క‌లిసి న‌టించిన సినిమా `ఊర్వ‌శివో - రాక్ష‌సివో`. ఈ సినిమాలో అల్లు - అనుల కెమిస్ట్రీ బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది. ఈ సినిమాకి అదే ప్ల‌స్ పాయింట్. ఇద్ద‌రూ రొమాంటిక్ సీన్ల‌లో, లిప్ లాకుల్లో మునిగిపోయారు. అయితే బ‌య‌ట కూడా వీరిద్ద‌రూ ల‌వ్ లో ఉన్నార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుకుంటున్నాయి. అందుకే కెమెరా ముందు కూడా వీళ్ల కెమిస్ట్రీ అంత‌గా పండింద‌ని టాక్ వినిపిస్తోంది.

 

దీనిపై ఓ ఇంట‌ర్వ్యూలో అను స్పందించింది ``ఈ సినిమా ప్రారంభ‌మైన రోజునే.. శిరీష్‌ని క‌లిశా. అక్క‌డే మా ప‌రిచ‌యం జ‌రిగింది. ఆ త‌ర‌వాత కాఫీ షాపులో క‌లిసి, ఈ క‌థ‌పై చ‌ర్చించుకొన్నాం. అంత మాత్రానికే ఇద్ద‌రం ప్రేమ‌లో ఉన్న‌ట్టా..? త‌ను నా కో - స్టార్ మాత్ర‌మే`` అని క్లారిటీ ఇచ్చింది. అయితే... త‌ను ల‌వ్‌లో ఉన్నానో, సింగిల్ గానే ఉన్నానో అస్స‌లు చెప్ప‌నంటోంది. దాన్ని బ‌ట్టి... అను ఇమ్మానియేల్ ఎవ‌రితో డేటింగ్ చేస్తోంద‌న్న విష‌యం చెప్ప‌క‌నే చెప్పిన‌ట్టైంది.

 

శిరీష్ కూడా ఇదే మాట అన్నాడు. అను ఎప్పుడూ ఫోన్ల‌లో మునిగిపోయి ఉంటుంద‌ని, సెట్లో చాటుగా ఫోన్ మాట్లాడుతూ... ముసి ముసి న‌వ్వులు న‌వ్వుతుంటుంద‌ని హింట్ ఇచ్చేశాడు. దాన్ని బ‌ట్టి అను ఇమ్మానియేల్ ల‌వ్ స్టోరీ న‌డుపుతున్న‌ట్టు ఇంకాస్త క్లారిటీ ఇచ్చేసింది. కాక‌పోతే.. అది అల్లు శిరీష్‌తో కాదు. అదీ ట్విస్టు.

ALSO READ: Anu Emmanuel Latest Photoshoot