ENGLISH

Yashoda: య‌శోద‌కు పెద్ద దెబ్బే !

05 November 2022-15:00 PM

ఈనెల 11న య‌శోద విడుదల అవుతోంది. స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన సినిమా ఇది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌ని కూడా స‌మంతే ముందుండి న‌డిపిస్తుంద‌ని అంతా అనుకొన్నారు. కానీ స‌మంత ఇప్పుడు అనారోగ్యం పాలైంది. ప్ర‌మోష‌న్ల‌లో పాల్గొన‌లేని ప‌రిస్థితి. డ‌బ్బింగ్ కూడా... చాలా క‌ష్ట‌ప‌డి, సెలైన్ ఎక్కించుకొంటూ చెప్పింది. ఈ సినిమా విడుద‌ల‌కు ఇంకా వారం రోజుల స‌మ‌యం కూడా లేదు. ప్ర‌మోష‌న్లు స్లోగా న‌డుస్తున్నాయి. స‌మంత కూడా ప్ర‌చారానికి రాక‌పోవ‌డం ఈ సినిమాకి పెద్ద దెబ్బ‌.

 

అయితే... స‌మంత ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌కు రాక‌పోయినా ఏదోలా ప్ర‌చారం చేసి పెట్టాల‌ని భావిస్తోంది. అందుకే.. ఓ వీడియో బైట్ గానీ, ఓ ఆడియో బైట్ గానీ విడుద‌ల చేయాల‌ని చూస్తోంద‌ట‌. దాంతో ప్ర‌చారం పూర్త‌వుతుంద‌ని కాదు. త‌న వంతుగా ఏదోటి చేయాలి క‌దా..? అందుకే ఈ ప్ర‌య‌త్నం. స‌మంత ప్ర‌మోష‌న్ల‌కు రాక‌పోవ‌డంతో.. ఈ సినిమాకి అస‌లు హైప్ లేకుండా పోయింది. అదే స‌మంత వ‌చ్చి, ఇంట‌ర్వ్యూలు ఇస్తే, ప్రీ రిలీజ్ లో మెరిస్తే ఆ లెక్క వేరేలా ఉండేది. స‌మంత అనారోగ్యంతో.. య‌శోద మాత్ర‌మే కాదు.. ఖుషి, శాకుంత‌లం టీమ్‌లూ న‌ష్ట‌పోతున్నాయి. అందుకే స‌మంత త్వ‌ర‌గా కోలుకోవాలని, తిరిగి సెట్స్ లోకి అడుగుపెట్టాల‌ని ఆయా చిత్ర‌బృందాలు కోరుకుంటున్నాయి.

ALSO READ: Trivikram: స్ర‌వంతి మూవీస్‌ ఋణం తీర్చుకుంటాడా?