'కాజల్ చెల్లివా.. కత్తిలాంటి ఫిగర్‌వా' అనే పాటేస్కోవాలనిపిస్తుంది కదా ఈ పిక్ చూస్తుంటే, స్కై బ్లూ కలర్ మోడ్రన్ డ్రస్సులో అనూ ఇమాన్యుయేల్ భలే క్యూట్‌గా ఉంది కదా. కనీ కనిపించని అందాలతో కవ్విస్తోందీ ముద్దుగుమ్మ. అన్ని అవకాశాలు కలిసొచ్చినట్లే కలిసొచ్చి చేజారిపోయాయి ఈ ముద్దుగుమ్మకి.
లక్ శాంతం గుమ్మం దాకా వచ్చి, వెనుదిరిగిపోయింది. అయినా కానీ అమ్మడిని లక్ ఇంకా వెంటాడుతూనే ఉందనిపిస్తోంది. అమ్మడిలో ఉన్న గ్లామర్ మహత్యమే అందుకు కారణం. త్వరలో 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగ చైతన్యతో 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రంలో నటిస్తోంది. రీసెంట్‌గా మాస్ రాజా రవితేజ హీరోగా ఓ సినిమాలో ఈ ముద్దుగుమ్మ ఛాన్స్ దక్కించుకుంది. శీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి 'అమర్ అక్బర్ ఆంటోనీ' అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
ఇటీవలే ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ఇలా ఈ ముద్దుగుమ్మని పరిశీలించట్లేదు అనుకుంటూనే, పరగణలోనికి తీసుకుని ఆఫర్లు ఇస్తూనే ఉన్నారు మన దర్శక నిర్మాతలు. అమ్మడి గ్లామర్ 'సుడి' అలాంటిది మరి.
ALSO READ: Qlik Here For The Gallery Of Anu Emmanuel