స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి నెక్స్ట్ సినిమా కూడా మెగా కాంపౌండ్‌లోనేనట. అది కూడా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌తో ఉండనుందనీ సమాచారమ్. 'ధృవ' టైంలోనే చరణ్ - సురేందర్ రెడ్డి ఓ అవగాహనకి వచ్చారట. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'ధృవ' రీమేక్ సబ్జెక్ట్. మొదట్లో సురేందర్ రెడ్డి ఇష్టపడలేదు ఆ సబ్జెక్ట్ చేయడానికి. కానీ చరణ్ ఒప్పించాడు.
అందుకే చరణ్‌తోనే సురేందర్‌రెడ్డి ఈ సారి స్ట్రెయిట్ సినిమా చేయబోతున్నాడట. 'ధృవ' టైంలో వినిపించిన సబ్జెక్టేనట అది. 'ధృవ' తర్వాతే ఈ సినిమాని సెట్స్ మీదకి వెళ్లాల్సి ఉందట. అయితే చిరంజీవి సినిమా లైన్‌లోకి రావడంతో ఈ సినిమా అనూహ్యంగా వెనక్కి వెళ్లింది. చిరంజీవితో ప్రస్తుతం సురేందర్ రెడ్డి చేస్తున్న 'సైరా నరసింహారెడ్డి' సినిమా పూర్తి కాగానే చరణ్ సినిమా సెట్స్ మీదికెళ్లనుందట. 'సైరా' ప్రేక్షకుల ముందుకు వచ్చేది వచ్చే ఏడాదిలోనే. అంటే చరణ్‌తో సురేందర్‌రెడ్డి సినినమా వచ్చే ఏడాది కానీ పట్టాలెక్కే అవకాశాలు లేవు. ఈలోగా చరణ్ చేయాల్సిన ప్రాజెక్టులు పూర్తి చేసుకోనున్నాడు.
చరణ్ - సుకుమార్ కాంబినేషన్‌లో ఆల్రెడీ 'రంగస్థలం' విడుదలకు సిద్ధంగా ఉంది. బోయపాటి శీనుతో చరణ్ చేస్తున్న సినిమా సెట్స్ మీద ఉంది. ఈ ఏడాదికి చరణ్ నుండి ఈ రెండు సినిమాలూ కన్‌ఫామ్ అయిపోయాయి. ఇక వచ్చే ఏడాదికి సురేందర్ రెడ్డి సినిమా సహా, కొరటాల శివతో మరో సినిమా చరణ్ చేయాల్సి ఉంది. అలా వచ్చే ఏడాదికి కూడా చరణ్ డైరీ ఫుల్ ఫిల్ అయిపోయిందనే చెప్పాలి. ఇక 'సైరా' విషయానికి వస్తే, సురేందర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకుడు కాగా, చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
ALSO READ: తాత పాత్రలో మనవడు?