ENGLISH

ఆ ముద్దగుమ్మకి మరో బంపర్‌ ఛాన్స్‌

03 October 2017-18:40 PM

'మజ్ను' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్‌. పరిచయమైన నాటి నుండీ బిజీగా గడుపుతోంది ఈ బ్యూటీ. వరుస అవకాశాలు దక్కించుకుంటూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఎన్టీఆర్‌ సినిమాలో ఆఫర్‌ దక్కించుకుందనీ సమాచారమ్‌. 'జై లవకుశ' సినిమా తర్వాత ఎన్టీఆర్‌ చేయబోయే మూవీ త్రివిక్రమ్‌ దర్శకత్వంలో. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఎన్టీఆర్‌ మూవీకి హీరోయిన్‌గా అనూ ఇమ్మాన్యుయేల్‌ని ఎంపిక చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇది నిజమైతే అమ్మడి దశ తిరిగిపోయినట్లే. స్టార్‌ హీరోయిన్‌ అనిపించుకోవడానికి ఇంకెంతో టైం పట్టదనిపిస్తోంది. ఇప్పటికే అమ్మడు ఏకంగా పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ సినిమాలో నటించేస్తోంది. పవన్‌ కళ్యాణ్‌తో సెల్ఫీలు దిగుతూ సూపర్బ్‌గా ఎంజాయ్‌ చేస్తోంది ఈ బ్యూటీ. ఇవి కాక గోపీచంద్‌తో 'ఆక్సిజన్‌' సినిమాలోనూ నటిస్తోంది అనూ ఇమ్మాన్యుయేల్‌. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సో ఈ ముద్దుగుమ్మ సో బిజీ అన్న మాటా. డిఫరెంట్‌ ఫీచర్స్‌ ఉన్న క్యూట్‌ ఫేస్‌తో కుర్రకారును భలే ఎట్రాక్ట్‌ చేస్తోంది. మత్తెక్కించే కళ్లు, ఆకట్టుకునే అందం ఆమె సొంతం. మలయాళీ బ్యూటీ కదా యాక్టింగ్‌ టాలెంట్‌తోనూ కట్టి పాడేస్తోంది. ఇప్పుడున్న హీరోయిన్స్‌కి గట్టి పోటీగా నిలుస్తూ, వరుస అవకాశాలతో దూస్కెళ్తోంది.

ALSO READ: సక్సెస్ మీట్ కి ‘NO’ చెప్పిన మహేష్?!