'మజ్ను' సినిమాతో తెరంగేట్రం చేసిన మలయాళ కుట్టీ అనూ ఇమ్మాన్యుయేల్ ఎగసి పడిన కెరటంలా ఉవ్వెత్తున ఎగసి తాకిడి తట్టుకోలేక పాతాళంలోకి పారిపోయింది. తెలుగులో స్టార్ హీరోయిన్ హోదాని కొన్ని అడుగుల దూరంలోనే మిస్ చేసుకుంది. అప్పటి వరకూ యంగ్ హీరోస్‌తోనే సరిపెట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఎట్ ఏ టైమ్ ఇద్దరు మెగా హీరోలు అల్లు అర్జున్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించి కెరీర్‌లో ఇక తిరుగే లేదనుకుంది. కానీ ఆ రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టేశాయి. ఆ తర్వాత నటించిన 'శైలజా రెడ్డి అల్లుడు' తదితర చిత్రాలు కూడా అనూని గట్టెక్కించలేకపోయాయి. దాంతో తెలుగులో పాప హవా పూర్తిగా పడిపోయింది. తమిళంలో ప్రస్తుతం ఒకట్రెండు చిత్రాల్లో నటిస్తున్న అనూ ఇమ్మాన్యుయేల్ మళ్లీ తెలుగులో నిలదొక్కుకునే ప్రయత్నాలు మొదలుపెట్టిందట. ఆ క్రమంలో నెట్టింట్లో హాట్ ఫోటో షూట్‌తో రెచ్చిపోయింది.
ఓ మోడరన్ టాప్ ధరించి వయ్యారంగా చేతుల పైకెత్తి ఓ చిలిపి పోజిచ్చింది. ఇంకేముంది చక్కనమ్మ చిలిపితనానికి కొంటె కుర్రగాళ్లు బ్యూటిఫుల్‌గా కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. నిజమే, ఈ పిక్స్‌లో అనూ స్లిమ్ అండ్ స్లీకీ లుక్స్ కుర్రకారులో కొత్త కోరికలు పుట్టిస్తున్నాయి. మరి ఆ కోరికలు మన దర్శక, నిర్మాతల్లోనూ కలిగితే పాప కోరిక తీరినట్లే. దశ తిరిగినట్లే.
ALSO READ: Anu Emmanuel Hot Photoshoot