ENGLISH

మరోసారి అనుష్క కే ఓటేసిన ప్రభాస్!!

10 June 2017-16:59 PM

అనుష్క-ప్రభాస్ ల జంట స్క్రీన్ పైన ఎంత చూడముచ్చటగా ఉంటుందంటే, వారు ఇద్దరు ఇక పెళ్లి చేసుకోబోతున్నారు అనే రూమర్స్ వస్తే వాటిని ప్రేక్షకులు నమ్మేసేలా ఉంటుంది వాళ్ళ జోడి.

ఇప్పటికే మిర్చి, బాహుబలి రెండు భాగాల్లో వీరు జంటగా నటించగా, ఇప్పుడు ప్రభాస్ కొత్తగా చేస్తున్న సాహూ చిత్రంలో సైతం అనుష్కనే హీరోయిన్ గా తీసుకున్నారు అని తెలుస్తుంది.

దీన్నిబట్టి చూస్తే, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బెస్ట్ పెయిర్ గా నిలిచే జంటల్లో వీరు చోటు దక్కించుకున్నారు. ఇక ఈ చిత్ర షూటింగ్ నిన్ననే మొదలయ్యింది.

 

ALSO READ: కోర్టు నోటిసులతో ప్రముఖ నటికి తలనొప్పులు!