బాలీవుడ్ బ్యూటీ అనుష్కా శర్మ హీరోయిన్‌గా గ్లామరస్ లుక్‌లో కనిపించడమే కాదు. నిర్మాతగా సహజత్వానికి దగ్గరగా ఉండే చిత్రాలను నిర్మించింది అనుష్క. ఇంతవరకూ రెండు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన ఈ ముద్దుగుమ్మ, ఈ సినిమాతో ముచ్చటగా మూడోసారి నిర్మాణ బాధ్యతలు తీసుకుంది. 'పరి' టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి అనుష్క నిర్మాతే కాదు లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ సినిమాలో అనుష్క పాత్రకి సంబంధించి ఫస్ట్‌లుక్ విడుదలైంది గతంలో దయ్యం పాత్రలో 'ఫిలౌరి' చిత్రంలో అనుష్క కనిపించింది. కానీ ఆ సినిమాలో అనుష్క దయ్యమైనా భయపెట్టలేదు. ఓ ఆత్మలా నార్మల్ లుక్‌లోనే కనిపించింది. కానీ ఈ సారి అలా కాదు. అనుష్క భయపెట్టేందుకు సిద్ధమవుతోందని ఈ లుక్ చూస్తే అర్ధమవుతోంది. నీలికళ్లతో భయంకరంగా కనిపిస్తోంది అనుష్క. ప్రోసిత్ రాయ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. పరంబ్రతా ఛటర్జీ కీలక పాత్రలో నటిస్తున్నాడు. దయ్యం కాన్సెప్టే కాకుండా ఈ సినిమాలో కొన్ని ఇంపార్టెంట్ సామాజిక అంశాల్ని కూడా హైలైట్ చేయనున్నారట. విలక్షణ పాత్రలకు అనుష్క ఎప్పుడూ ముందుంటుంది. బాలీవుడ్‌లో వరుస విజయాలతో సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా దూసుకెళ్లిపోతోంది ఈ ముద్దుగుమ్మ. అనుష్క లుక్ చూస్తుంటే తాజా చిత్రంపై కూడా అంచనాలు భారీగా నెలకొన్నాయి.
ALSO READ: ‘కోటి’ కావాలంటున్న పూజా?!