దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోమన్నారు పెద్దలు. ఈ తెలుగు సామెత మరి పూజా హెగ్డే కి ఎలా తెలిసిందో లేదో మనకు తెలియదు కాని ఆ సామెతని మాత్రం తూచా తప్పకుండా పాటిస్తున్నది.
తెలియవస్తున్న సమాచారం ప్రకారం, పూజా హెగ్డే ని బెల్లంకొండ శ్రీనివాస్-శ్రీవాస్ సినిమాలో హీరోయిన్ గా తీసుకుందామని ఆమెని సంప్రదించారట. అయితే ఆమే రెమ్యునరేషన్ గా 1 కోటి రూపాయలు డిమాండ్ చేసినట్టు సమాచారం.
ఇది విని ఒక్కసారిగా నిర్మాతలు షాక్ తిన్నారట. ఈమె ఇంతలా డిమాండ్ చేయడానికి కారణం, ఆమె నటిస్తున్న DJ చిత్రానికి వస్తున్న ఫాలోయింగ్ అని తెలుస్తుంది.
మరి నిర్మాతలు కోటి చెల్లించుకుని ఈమెని తీసుకుంటారా లేక వేరే ఎవరినైనా తీసుకుంటారా అనేది తెలియాల్సివుంది.
ALSO READ: తెలంగాణ అసెంబ్లీలో మహేష్?!