పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విజేత AR రెహమాన్ తన భార్య నుంచి విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసందే. రెహమాన్ భార్య సైరా భాను ఈ విషయాన్నీ తన లాయర్ వందనా షా ద్వారా తెలిపారు. 29 ఏళ్ళ వైవాహిక బంధానికి స్వస్తి చెప్పారు. ఇద్దరి మధ్య ఏర్పడిన అభిప్రాయభేదాలు కారణంగా పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లు తెలిపి. క్లిష్ట సమయంలో సపోర్ట్ గా ఉండాలని ఫాన్స్ ని అభ్యర్ధించారు. ఇవన్నీ ఓకే కానీ కొన్ని గంటల్లోనే రెహమాన్ అసిస్టెంట్ కూడా విడాకుల ప్రకటన చేయటం పలువుర్ని ఆశ్చర్యానికి గురి చేసింది.
రెహమాన్, సైరా భాను డివోర్స్ ప్రకటించారు. అది వారి వ్యక్తి గత జీవితం. కానీ కొన్ని గంటల వ్యవధిలోనే రెహమాన్ అసిస్టెంట్ మోహిని డే కూడా తన భర్తతో విడిపోతున్నట్లు ప్రకటించింది. దీనితో నెటిజన్స్ , ఫాన్స్ షాకయ్యారు. రెహమాన్ నుంచి భార్య విడిపోవడానికి కారణం మోహిని అయ్యి ఉండొచ్చా అని అనుమానాలు మొదలయ్యాయి. లేకపోతే ఇద్దరూ ఒకే రోజు ఇలా డివోర్స్ తీసుకోవటం ఏంటి? ఇది కచ్చితంగా కో ఇన్సిడెన్స్ కాదని వాదిస్తున్నారు.
మోహిని డే రెహమాన్ దగ్గర మ్యూజిక్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తోంది. వోకలిస్ట్ గా, ప్రైవేట్ సాంగ్స్ కూడా చేస్తుంటుంది. మోహిని డే కూడా డివోర్స్ అనౌన్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. 'మార్క్ నేను విడిపోవాలని డిసైడ్ అయ్యాం. మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరి సపోర్ట్ తోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. పరస్పర అంగీకారంతో వేరు అయినా కొన్ని ప్రాజెక్ట్స్ కి ఇద్దరం కలిసి పని చేస్తున్నాం అని' తెలిపింది. రెహమాన్ విడాకులతో మోహినికి నిజంగా సంబంధం ఉందో లేదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.