ENGLISH

రష్మికతో రిలేషన్ పై విజయ్ క్లారిటీ

21 November 2024-15:40 PM

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలంతా పెళ్లి పీటలెక్కుతున్నారు. ఈ క్రమంలో కొందరి లవ్ స్టోరీలు గూర్చి, డేటింగ్ రూమర్లు, పెళ్లి వార్తలు గుప్పుమంటున్నాయి. ఇన్నాళ్లు మా మధ్య ఏం లేదు అంటూనే చైతు, శోభిత ఎంగేజ్ మెంట్ చేసుకుని ఫాన్స్ కి షాకిచ్చారు. నెక్స్ట్ కీర్తి సురేష్ కూడా నేను ప్రేమలో పడితే మీకే ముందు చెప్తా అంటూ చివరికి సైలెంట్ గా పెళ్ళికి సిద్ధం అయిపోయింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ రష్మిక ప్రేమ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ఎప్పటినుంచో విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య రిలేషన్ గూర్చి పుకార్లు వస్తున్నా వారు ఎప్పుడు వాటిని ఖండించలేదు, ధ్రువీకరించలేదు. వెకేషన్స్ కి, డిన్నర్ లకి, పార్టీ లకి వెళ్లిన ఫొటోస్ చాలా సార్లు బయటికి వచ్చాయి. అంతే కాదు రష్మిక ప్రతి పండగని విజయ్ ఫ్యామిలీ తో కలిసి చేసుకుంటుంది. ఈ విషయం కూడా పలు సందర్భాల్లో రుజువయ్యింది. ఆనంద్ దేవరకొండ సినిమా  ప్రమోషన్స్ కి రష్మిక అటెండ్ అవుతూ ఉంటుంది. ఒక సందర్భంలో పబ్లిక్ గా ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీ రా అంది రష్మిక. ఇవన్నీ వీరి రిలేషన్ గూర్చి చెప్పకనే చెప్తున్నాయి. దీనితో వీరి పెళ్లి ఎప్పుడు అని ఫాన్స్ ఆరా తీస్తూ ఉంటారు.

ప్రజంట్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు వీరిద్దరూ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ తన లవ్, మ్యారేజ్, లైఫ్, కెరీర్‌ గూర్చి తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నాడు. నేను సింగిల్ గా లేనని, ఇపుడు నా ఏజ్ 35 సంవత్సరాలు, మరి సింగిల్ గా ఉన్నానని ఎలా అనుకుంటారు. అలా అని నేను డేటింగ్ చేస్తూ కాలక్షేపం చేయటం లేదు. నా లైఫ్ పార్ట్నర్ తోనే నేను బయటికి వెళ్తున్నా, నాకు నా పర్సనల్ లైఫ్ లో చాలా షరతులు ఉన్నాయని, నన్ను ప్రేమించే వారికీ కొన్ని ఆశలు ఉంటాయని పేర్కొన్నాడు విజయ్.

కెరీర్‌లో పెళ్లి భాగం కాదని, లేడీస్ కి పెళ్లి, కెరియర్ బ్యాలెన్స్ చేయటం చాలా కష్టం అని విజయ్ దేవరకొండ స్పష్టం చేసాడు. చెప్పీ చెప్పనట్టుగా రష్మికతో తనకి ఉన్న రిలేషన్ గూర్చి హింట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇద్దరూ చేతినిండా సినిమాలతో బిజీగా ఉండటం వలన ఇంకొన్ని రోజులు పెళ్లి ఆలోచన లేదని తెలుస్తోంది. రష్మిక వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉంది, కెరియర్ దృష్టిలో పెట్టుకుని తమ రిలేషన్ ని కూడా బయటపెట్టడం లేదు వీరు.