ENGLISH

గెట్‌ రెడీ: 'అర్జున్‌రెడ్డి' వచ్చేస్తున్నాడు

09 October 2017-16:22 PM

'అర్జున్‌రెడ్డి' సినిమా విడుదలై సంచలన విజయం సాధించింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా రావడమేంటని అనుకుంటున్నారా? ఇది సెన్సార్‌ కాని సినిమా. దీన్ని ఈ నెల 13న విడుదల చేస్తారు. అదేంటీ, సెన్సార్‌ అవని సినిమాని ఎలా రిలీజ్‌ చేస్తారనే డౌట్‌ మీకొచ్చిందా? వస్తుందిలెండి మరి. అసలు విషయమేంటంటే, 'అమేజాన్‌ ప్రైమ్‌ వీడియోస్‌' విడుదల చేస్తోంది ఈ సినిమాని. ఇంగ్లీష్‌ సబ్‌ టైటిల్స్‌తో సినిమాని విడుదల చేస్తున్నారు. థియేటర్లలోనూ, టీవీలోనూ ఈ వెర్షన్‌ ప్రసారం కాదు. కేవలం అమేజాన్‌ ప్రైమ్‌ వీడియోస్‌లోనే చూడాలి. ఇంకో వైపున బుల్లితెరపై 'అర్జున్‌రెడ్డి' అతి త్వరలో కనిపించబోతోంది. బుల్లితెరపై సెన్సార్డ్‌ వెర్షనే సుమీ. అయినా కానీ ఈ సినిమా గురించి వెయిటింగ్‌ అలాగే ఉంటుంది. సెన్సార్‌ అయినాకనే సెన్సేషన్‌ ఇలా ఉంటే, ఇక సెన్సార్‌ కాకుండా 'అర్జున్‌రెడ్డి' అంటే ఇంకెంత క్యూరియాసిటీ ఉంటుందో కదా. లిప్‌లాక్స్‌, డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌..ఎక్స్‌ట్రా ఎక్స్‌ట్రా అన్నీ కొత్తగా విడుదలయ్యే 'అర్జున్‌రెడ్డి'లో ఉండబోతున్నాయి మరి. డిజిటల్‌ రంగంలో దూసుకుపోతోన్న 'అమేజాన్‌ ప్రైమ్‌ వీడియోస్‌' అన్‌సెన్సార్డ్‌ మూవీస్‌ని అందించడం ద్వారా తన ప్రత్యేకతను చాటుకుంటోంది. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ తెచ్చిన సౌలభ్యమిది. ఈ న్యూస్‌ రివీల్‌ అయినప్పటి నుండీ 'అర్జున్‌రెడ్డి' మరో సెన్సేషన్‌ స్టార్ట్‌ అయిపోయింది. ఇక సినిమా డిజిటల్‌ వెర్షన్‌ రిలీజ్‌ అయితే రికార్డులు, సంచలనాలు ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయో చూడాలిక.

ALSO READ: ప్రముఖ తెలుగు యాంకర్ మృతి