ENGLISH

పాఠాలు చెప్తోన్న అందాల దెయ్యం

09 October 2017-16:14 PM

'రాజుగారి గది - 2' సినిమాలోనిదీ స్టిల్‌. అదిరింది కదా! అది సరే ఇక్కడ ఫోటోలో ఉన్నది బ్యూటీ సమంత కదా. సమంత ఈ సినిమాలో భయపెట్టే దెయ్యం కదా. ఇదేంటి పాఠాలు చెప్పే పంతులమ్మ గెటప్‌లో ఉంది అనుకుంటున్నారా? అదే ట్విస్ట్‌. లేటెస్టుగా విడుదలైన ఈ పిక్‌తో సమంతలోని మరో యాంగిల్‌ బయటికి వచ్చింది. ఇంతవరకూ సమంతది దెయ్యం పాత్ర అంటూ ప్రచారం జరిగింది. ప్రచార చిత్రాలు కూడా అదే యాంగిల్‌ని చూపించాయి. అయితే కొత్తగా వచ్చిన ఈ స్టిల్‌తో అంచనాలు మారిపోయాయి. అలాగే ఈ స్టిల్‌ సినిమాపై ఇంట్రెస్ట్‌ని పెంచుతోంది కూడా. పంచెకట్టులో సమంత, చేతిలో స్టిక్‌తో సరదా సరదాగా పిల్లలకు పాఠాలు చెబుతున్న దృశ్యం భలే ఉంది. అసలే నాటీ పిల్ల. అందులోనూ పంతులమ్మ. పంచె కట్టు కట్టిన పంతులమ్మ. పిల్లల్ని భయపెట్టేందుకు చేతిలో స్టిక్‌.. కానీ ముఖంలో చిలిపిగా నవ్వు.. ఏమో ఈ పంతులమ్మ ఏం మాయ చేస్తుందో కానీ, స్టిల్‌కి మాత్రం మంచి రెస్పాన్స్‌ వస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి ఓంకార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మెంటలిస్ట్‌ పాత్రలో నటిస్తున్నారు నాగార్జున. సీరత్‌ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. అశ్విన్‌ బాబు, షకలక శంకర్‌ తదితరులు ఇతర ముఖ్య తారాగణంగా నటిస్తున్నారు.

ALSO READ: ప్రముఖ తెలుగు యాంకర్ మృతి