ENGLISH

'అశ్వథ్థామ'కు ప్రీ రిలీజ్‌ బజ్‌ అదిరింది.!

31 January 2020-09:30 AM

బూతు సినిమాల ద్వారా సభ్య సమాజానికి ఏం మెసేజ్‌ ఇస్తున్నారో అనే విషయం పక్కన పెడితే, కొన్ని సినిమాలు సమాజంపై కీలక ప్రభావం చూపిస్తుంటాయి. మహిళలపై జరుగుతున్న అకృత్యాలనూ, అరాచకాలనూ ప్రతిరోజూ వార్తల్లో చూస్తున్నాం. ఇలాంటి కొన్ని నిజ సంఘటనలే తన సినిమాకి కథా వస్తువుగా ఎంచుకుని కమర్షియల్‌ థాట్‌ లేకుండా ఓ మంచి ఆలోచనతో తెరకెక్కిన సినిమా 'అశ్వథ్ధామ'. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. పక్కింటబ్బాయ్‌ నాగశౌర్య సీరియస్‌ మోడ్‌లో నటించిన చిత్రమిది. సొంతంగా సిద్ధం చేసిన కథలో నాగశౌర్య తొలిసారి నటిస్తున్నాడు.

 

రమణతేజను డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ, హోమ్‌ బ్యానర్‌ ఐరా క్రియేషన్స్‌లో ఈ సినిమా రూపొందిస్తున్నాడు నాగశౌర్య. క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకి ప్రీ రిలీజ్‌ బజ్‌ బాగుంది. గతంలోనూ ఈ తరహాలో కొన్ని సినిమాలొచ్చాయన్న నేపథ్యం ఉన్నా, వాటన్నింట్లోకీ 'అశ్వథ్ధామ'లో ఏదో తెలియని కొత్త అంశం దాగుందని చిత్ర యూనిట్‌ మాటల ద్వారా తెలుస్తోంది. ఇకపోతే రీసెంట్‌గా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన దర్శకేంద్రులు రాఘవేంద్రరావు నాగశౌర్య జన్యూన్‌ అటెంప్ట్‌కి ఈ సినిమా సూపర్‌ హిట్‌ అవ్వాలని కోరుకున్నారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది. ఫైనల్‌గా ఆడియన్స్‌ టాక్‌ ఎలా ఉందో తెలియాలంటే, మరి కాసేపు ఆగాల్సిందే. ముద్దుగుమ్మ మెహ్రీన్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.

ALSO READ: సూపర్‌హీరోకి నో చెప్పిన ప్రబాస్‌.!