'చిరుత' సినిమాలో ముద్దు ముద్దుగా డైలాగ్స్ చెబుతూ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ నేహా శర్మ. తొలి సినిమానే అయినా, యాక్టింగ్ ఓకే అనిపించుకుంది. ఎక్స్‌పోజింగ్ చితక్కొట్టేసింది. అఫ్‌కోర్స్ పూరీ సినిమాల్లో హీరోయిన్లు అలా ఉండక తప్పదనుకోండి. అంత చేసినా ఆ తర్వాత ఈ హాట్ బ్యూటీని ఎవ్వరూ పట్టించుకోనే లేదు పాపం. ఏదో ఒకటీ అరా చిత్రాల్లో చేసినా అవి అంతగా కలిసి రాలేదు పాపం నేహా శర్మకి. తర్వాత బాలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకుంది. అడపా దడపా చిత్రాల్లో కనిపిస్తోంది. అయితే, మెయిన్ లీడ్ హీరోయిన్ రోల్స్ కావవి. ఇటీవలే 'తానాజీ' సినిమాలో ఓ చిన్న రోల్‌లో మెరిసింది.
మరో సినిమాలోనూ అలాగే ఎలాగోలా ఓ క్యారెక్టర్ దక్కించుకుంది. కానీ, తెలుగులో మంచి పాత్ర కోసం ఎదురు చూస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ హాట్ సెన్స్ చూసి, తెలుగోళ్లు కనికరించలేదు. కానీ, ఓ పంజాబీ మూవీలో ఆఫర్ వచ్చింది. ప్రస్తుతం ఈ పాప చేతిలో ఇదే చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్‌గా భావిస్తోందట. ఇక ఇప్పటికైతే ఇదిగో ఇలా ఈ తరహా అందాల ఆరబోతతో సరిపెట్టుకుంటోంది. చూస్తున్నారుగా నేవీ బ్లూ కలర్‌లో డిజైనర్ స్లీవ్‌లెస్ ఫ్రాక్ ధరించి ఓ మాస్ సిట్టింగ్ వేసింది. డార్క్ కలర్ డ్రస్ కావడంతో, స్కిన్ టోన్ బ్రైట్ అప్పీల్ ఇస్తోంది. రెండూ వెరసి మతి పోగొట్టే సెక్సప్పీల్ దర్శనమిస్తోంది.
ALSO READ: Neha Sharma Hot Photoshoot