ENGLISH

బాలయ్య రేర్ ఫీట్.... 100 కోట్ల క్లబ్ లో కొత్త రికార్డు

16 January 2025-15:43 PM

నందమూరి నట సింహం బాల‌కృష్ణ హవా మాములుగా లేదు. ఒక వైపు రాజకీయాల్లో సత్తా చాటుతూనే వరుస సినిమాల్లో నటిస్తూ హ్యాట్రిక్ హిట్స్ కొట్టారు. అన్స్టాపబుల్ షో తో ఫాలోయింగ్ పెంచుకుని, ఒక తెలుగు టాక్ షో ని పాన్ ఇండియా షో గా మార్చేశారు. ఇప్పుడు 'డాకు మహారాజ్' తో ఇంకొక బిగ్గెస్ట్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు బాలయ్య. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన 'డాకు మ‌హారాజ్‌' సంక్రాంతి బరిలో దిగి ప్రేక్షకుల మనసు గెల్చుకుంది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న రిలీజ్ అయిన ఈ చిత్రం సినీప్రియులకి కావాల్సిన యాక్ష‌న్‌తో పాటు ఎమోష‌న్ కూడా అందించి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. బాలయ్య న్యూ గెటప్, మ్యానరిజం, బాబీ స్టయిలిష్ మేకింగ్, తమన్ మ్యూజిక్ అన్నీ ఈ మూవీకి ప్లస్ అయ్యాయి.

ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర డాకు మ‌హారాజ్ హ‌వా న‌డుస్తోంది. కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. రిలీజ్ అయిన నాలుగు రోజుల్లో 105 కోట్ల గ్రాస్ కలక్ట్ చేసింది. దీంతో బాలయ్య ఫాన్స్ ఆనందానికి హద్దులు లేవు. ఈ విష‌యాన్ని టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఫస్ట్ డే  56 కోట్లు వసూల్ చేసి బాల‌య్య కెరీర్‌లోనే హ‌య్యెస్ట్ ఓపెనింగ్‌గా నిలిచింది. ఇంకా వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉంది. సినిమా టార్గెట్ 160 కోట్లు. నాలుగు రోజుల్లోనే 100 కోట్లు దాటి వసూల్ చేసిన ఈ మూవీ తొందరలోనే టార్గెట్ రీచ్ అవుతుంది అని టీమ్ హర్షం వ్యక్తం చేస్తోంది.

బాలయ్య వరుసగా నాలుగు సినిమాలతో 100 కోట్ల క్లబ్ లో చేరటం విశేషం. ఏ హీరో సాధించని రికార్డ్ బాలయ్య సాధించారు. వీరసింహారెడ్డి 134 కోట్ల కలక్షన్స్ తో, అఖండ మూవీ 133 కోట్లతో,  భగవంత్ కేసరి 132 కోట్ల కలక్షన్స్ సాధించగా, డాకూ మహారాజ్ నాలుగు రోజులకే 105 కోట్లు కలక్ట్ చేసింది. లాంగ్ రన్ లో డాకు మహారాజ్ తో 200 కోట్ల కలక్షన్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

ALSO READ: సైఫ్ ఆలీఖాన్ పై దాడి.... అసలు ఏం జరిగింది?