బాలకృష్ణ వందో సినిమా 'గౌతమీ పుత్ర శాతకర్ణి' తర్వాత అస్సలు గ్యాప్ తీసుకోకుండా 'పైసా వసూల్', 'జై సింహా' చిత్రాల్లో నటించాడు. అయితే 'శాతకర్ణి'తో వచ్చిన సక్సెస్ ఈ రెండు చిత్రాలతో రాలేదు.
ఇదిలా ఉంటే, బాలయ్య 'జై సింహా' తర్వాత సినిమాలకు బ్రేకిస్తాడనీ, రాజకీయాల్లో బిజీ అవుతాడనీ ప్రచారం జరిగింది. కానీ బాలయ్య మాత్రం తేజ దర్వకత్వంలో చేయాల్సిన 'ఎన్టీఆర్' సినిమా చేశాకనే రాజకీయాల్లో బిజీ అవుతాననీ తాజాగా ప్రకటించారు. అంతేకాదు 2019 ఎలక్షన్స్‌లోగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాననీ బాలయ్య తెలిపారు. ఆ దిశగా త్వరలోనే 'ఎన్టీఆర్' చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.
ఆ సందర్భంగా ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. కాగా ఇప్పుడు బాలయ్య చేసేది ఈ ఒక్క సినిమానే కాదట, రెండు సినిమాలట అంటూ టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. బాలయ్య స్పీడుకు యంగ్ హీరోలు కూడా సరిపోలేరు. ఆ మాట సత్యం. ఆ స్పీడుతోనే వరుసపెట్టి మూడు సినిమాలు చేసేశాడు బాలయ్య. అలాగే బాలయ్య తలచుకుంటే, ఒకవేళ రాబోయే ఎలక్షన్స్ లోపల రెండు చిత్రాలూ పూర్తి చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే బాలకృష్ణ తాజాగా చేయబోయే ఆ రెండో చిత్రం ఏంటయ్యా అంటే బోయపాటి శీనుతోనట.
బోయపాటి - బాలయ్య కాంబినేషన్ సూపర్ హిట్ కాంబినేషన్. బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్స్ అయిన 'సింహా', 'లెజెండ్' సినిమాలు బోయపాటి దర్శకత్వంలో వచ్చినవే. అందుకే బోయపాటితో సినిమా అంటే బాలయ్య కాదనడు. కానీ ప్రస్తుతం బోయపాటి, చరణ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే, బాలయ్యతో సినిమా పట్టాలెక్కించేస్తాడట బోయపాటి. అంతేకాదు జూన్ 10న ఈ సినిమా స్టార్ట్ కానుందనీ తాజా సమాచారమ్. ఇంకేం ఈ వార్త బాలయ్య అభిమానులకు నిజంగా పండగలాంటిదే.
ALSO READ: కిరాక్ పార్టీ తెలుగు మూవీ రివ్యూ & రేటింగ్