ENGLISH

ఇంద్రజకి షాకింగ్ గిఫ్ట్ ఇచ్చిన బాలయ్య

14 March 2018-11:11 AM

ప్రముఖ నటి ఇంద్రజ కొద్దికాలం క్రిందట స్టార్ హీరోయిన్ గా తెలుగునాట అందరిని అలరించింది. ఇక ఆమె హీరో బాలకృష్ణ ప్రక్కన పలు విజయవంతమైన చిత్రాలలో నటించింది. 

ఇక తాజాగా కమెడియన్ అలీ నిర్వహించే ఒక టాక్ షోకి వచ్చిన ఇంద్రజకి ఆయన ఒక ఆసక్తికర ప్రశ్న వేశాడు. అదేంటంటే- పెద్దన్నయ్య చిత్రం షూటింగ్ లో ఇంద్రజకి హీరో బాలకృష్ణ ఒక గిఫ్ట్ ఇచ్చరాట అని అలీ అడిగారు. దీనితో ఒక్కసారిగా మీకు ఈ విషయం ఎలా తెలుసు అని ఇంద్రజ ఆశ్చర్యపోయింది. 

అయితే తనకి బాలయ్యనే ఈ విషయం చెప్పారు అని తెలిపాడు. ఇంతకి ఆ గిఫ్ట్ ఏంటంటే- ఒక అందమైన అమ్మాయి ఆకారంలో ఉండే పెర్ఫ్యూమ్ బాటిల్. ఊహించని విధంగా ఇలా గిఫ్ట్ ఇచ్చేసరికి షాక్ అయ్యాను అని చెప్పుకొచ్చింది.

ఇక ఇదే షోలో బాలకృష్ణతో సినిమాలు చేసేటప్పుడు తన అనుభవాలని పంచుకుంది.

 

ALSO READ: హీరోయిన్ హన్సిక పై చీటింగ్ కేసు నమోదు..!