ENGLISH

సీక్వెల్స్ పై ద్రుష్టి పెట్టిన బాలయ్య

26 April 2024-13:34 PM

సీనియర్ హీరోల్లో ప్రజంట్ బాలయ్య  జర్నీ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. ఒక వైపు రాజకీయాలు, ఇంకో వైపు  వరస సినిమాలు, మధ్యలో NBK టాక్ షో తో బాలయ్య యమా స్పీడ్ గా ఉన్నారు. యంగ్ హీరోలు కూడా బాలయ్యని అందుకోలేక పోతున్నారు. హ్యాట్రిక్ హిట్లతో జోరుమీదున్న బాలయ్య ప్రజంట్ బాబీ డైరక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారు. ఈ మూవీ దసరా బరిలో నిలవనుంది. ఏపీ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బాలకృష్ణ తాను పోటీ చేస్తున్న హిందూపురం నియోజక వర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల తరవాత మళ్ళీ రెగ్యుల ర్ గా  షూటింగ్స్ లో పాల్గొంటారు. బాబీ సినిమా తరవాత బాలకృష్ణ చేయబోయే సినిమాలపై లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది. ఈ న్యూస్ నందమూరి ఫాన్స్ ని సంతోషంలో ముంచింది. 
 

ఎన్నిక‌లు ముగిశాక బాలయ్య  త‌న హిట్ సినిమాలకి  సీక్వెల్స్ తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట.  కొత్త సినిమా కథలు  వెతుక్కునే కంటే తన కెరియర్లో బెస్ట్ ఫిల్మ్ గా నిల్చిన వాటికే ఓటు వేస్తున్నారని టాక్. అందులో భాగంగా అఖండ, లెజెండ్  లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకి సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే బాలయ్య , బోయ పాటి కాంబోలో వచ్చిన అఖండ సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలు తరవాత ఈ మూవీ షూటింగ్ మొదలవుతుందని టాక్. ఈ చిత్రం తరవాత లెజెండ్ సినిమాకి  సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. 


2014 లో వచ్చిన లెజెండ్  మూవీకి 10 ఏళ్ళ తరువాత సీక్వెల్ ప్లాన్ చేస్తుండటం విశేషం. ఈ చిత్రం రీరిలీజ్ సందర్భంగా మేకర్స్ కి ఈ ఆలోచన వచ్చినట్టు తెలుస్తోంది.  అఖండ, లెజెండ్ రెండిటికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. బోయపాటి, బాలయ్య కాంబో అంటే సూపర్ హిట్ గ్యారంటీ. బోయపాటి బాలయ్యకి మాత్రమే కలిసి వస్తాడనే అపవాదు కూడా ఉంది. బోయపాటి కూడా తనకి కలిసి వచ్చే హీరో, అదే కథ తోనే మళ్ళీ సిద్ధమవుతున్నారని సమాచారం. ఇందుకోసమే బోయ‌పాటి లెజెండ్ సీక్వెల్ స్క్రిప్టును కూడా రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది.  ఇలా బోయపాటి, బాలయ్య కాంబో మళ్ళీ మళ్ళీ రిపీట్ కానుంది.