ENGLISH

బాల‌య్య టైటిల్ 'తేడా'గా ఉందే..!

05 June 2017-10:41 AM

నంద‌మూరి  బాల‌కృష్ణ - పూరి జ‌గ‌న్నాథ్‌ల కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి పూరి ఎలాంటి టైటిల్ పెట్టి ఉంటాడా... అంటూ అంద‌రిలోనూ ఆస‌క్తి మొద‌లైపోయింది. పూరి టైటిళ్లు తేడా తేడాగానే ఉంటాయి. ఇడియ‌ట్‌, పోరికి, లోఫ‌ర్‌, రోగ్‌... ఇలా హీరోని తిట్టేస్తుంటాడు. బాల‌య్య‌కీ అలాంటి టైటిల్ ఏమైనా పెడ‌తాడా, లేదంటే.. బాల‌య్య ఇమేజ్‌కి త‌గిన టైటిల్‌తో స‌ర్దుకు పోతాడా? అని ఎదురుచూస్తున్న వేళ  ఓ టైటిల్ షికారు చేస్తోంది. అదే.. 'తేడా సింగ్'. భ‌వ్య క్రియేష‌న్స్ సంస్థ ఫిల్మ్ ఛాంబ‌ర్‌లో  ఈ పేరు రిజిస్ట‌ర్ చేయించింద‌ని స‌మాచారం. అది బాల‌య్య కోస‌మే అన్న టాక్ వినిపిస్తోంది. జై బాల‌య్య‌, ఉస్తాద్ అనే టైటిళ్లు కూడా ఈ సినిమా కోసం ప‌రిశీలిస్తున్నారు. మ‌రి వీటిలో ఏది ఫైన‌ల్ అవుతుందో చూడాలి.

ALSO READ: ఐక్లిక్ మూవీస్ టాక్ అఫ్ ది వీక్- ఫ్యాషన్ డిజైనర్ సన్ అఫ్ లేడీస్ టైలర్ & అంధగ�