ENGLISH

పూరీ - బాలయ్య మూవీలో ఆ ఐటెం?

30 May 2017-18:02 PM

'రేసు గుర్రం' సినిమాలో అల్లు అర్జున్‌ పక్కన 'బూచాడే బూచాడే.. ' అంటూ ఐటెం సాంగ్‌లో క్యూట్‌గా మెరిసింది కైరా దత్‌. తన డాన్సింగ్‌ స్టెప్పులతో పాటు, క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తోనూ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ భామ ఇప్పుడు ఓ బంపర్‌ ఆఫర్‌ దక్కించుకుంది. పూరీ జగన్నాధ్‌ డైరెక్షన్‌లో బాలయ్య హీరోగా తెరకెక్కుతోన్న చిత్రంలో అమ్మడు నటించే ఛాన్స్‌ కొట్టేసింది. అయితే ఈ సినిమాలో కైరా ఐటెం సాంగ్‌ చేస్తుందా? లేక ఆమెకు కొన్ని సీన్స్‌ ఉన్నాయా అనేది స్పష్టత లేదు. లేటెస్టుగా పోర్చుగల్‌లో షూటింగ్‌ జరుపుకుంటోన్న ఈ చిత్ర యూనిట్‌తో ఈ ముద్దుగుమ్మ కైరా దత్‌ జాయిన్‌ అయ్యింది. ఈ సినిమాలో కైరాతో ఓ ఐటెం సాంగ్‌ ఉండబోతోందంటూ ప్రచారం జరుగుతోంది. అలాగే ఓన్లీ ఐటెం సాంగే కాకుండా, ఆమెకు కొన్ని కీలక సన్నివేశాలు కూడా ఉన్నాయంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో శ్రియ ఓ హీరోయిన్‌ కాగా, మరో ఇద్దరు ముద్దుగుమ్మలున్నట్లు సమాచారమ్‌. యాక్షన్‌ సీన్స్‌లో బాలయ్య చూపించే జోరు చూసి, చిత్ర యూనిట్‌ ఆశ్చర్యపోతోంది. డాన్సుల్లో కూడా గ్రేస్‌ చూపిస్తున్నారట. వయసుకు మించిన డాన్సు స్టెప్పులు బాలయ్య ప్రాక్టీస్‌ చేస్తున్నారట. 'గౌతమీ పుత్ర శాతకర్ణి' వంటి చారిత్రాత్మక చిత్రంతో ఆకట్టుకున్న బాలయ్య, ఇప్పుడు రాబోతున్న ఈ తాజా సినిమాతో బాలయ్య ఫ్యాన్స్‌కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్‌తోనూ కట్టిపారేయనున్నాడట. సెప్టెంబరులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ALSO READ: మళ్ళీ ఆసుపత్రికి దాసరి?!