ENGLISH

లైవ్‌లో బాలయ్య - పూరీ

10 June 2017-17:41 PM

పూరీ - బాలయ్య కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాకి 'పైసా వసూల్‌' అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా పోర్చుగల్‌లో షూటింగ్‌ జరుపుకుంటోంది. పోర్చుగల్‌ నుండి బాలయ్య - పూరీ ఫేస్‌ బుక్‌లో ఫ్యాన్స్‌తో ఛాటింగ్‌ చేశారు. ఈ ఛాటింగ్‌కి ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. బాలయ్య నుండి రాబోతున్న ఈ సినిమా ఫ్యాన్స్‌ని ఏ స్థాయిలో అలరించాలో ఆ స్థాయిలో అలరిస్తుందంటూ చిత్ర యూనిట్‌ నమ్మకం వ్యక్తం చేస్తోంది. అలాగే సోషల్‌ మీడియాలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు బాలయ్య - పూరీ డైరెక్ట్‌గా సమాధానాలు ఇచ్చారు. చాలా సరదా సరదాగా సాగింది ఈ ఛాటింగ్‌. ఈ సినిమాలో శ్రియ, ముస్కాన్‌, కైరా దత్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య చేసిన యాక్షన్‌ సీక్వెన్స్‌ ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఉంటాయి. బాలయ్య ద్వారా పూరీ బంపర్‌ హిట్‌ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. డైలాగులకి పెట్టింది పేరు బాలయ్య. ఈ సినిమాలో పూరీ రాసిన డైలాగులు బాలయ్య నోట ధియేటర్లో ఆరాచకం సృస్టించనున్నాయని పూరీ చెబుతున్నారు. ఈ రోజు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమా టైటిల్‌ని ఒక రోజు ముందుగానే విడుదల చేసి ఫ్యాన్స్‌కి మంచి బహుమతి ఇచ్చాడు బాలయ్య.

ALSO READ: తప్పంతా నాదే అని ఒప్పుకున్న మనిషా కొయిరాలా!