ENGLISH

భీమ్లా ఆశ‌ల‌పై నీళ్లు

07 March 2022-11:07 AM

ఫిబ్ర‌వ‌రి 25న సూప‌ర్ హిట్ టాక్ తో విడుద‌లైంది భీమ్లా నాయ‌క్‌. తొలి మూడు రోజులూ రికార్డు వ‌సూళ్లు సాధించింది. మ‌హా శివ‌రాత్రి సెల‌వు కూడా భీమ్లా నాయ‌క్ కి క‌లిసొచ్చింది. అయితే ఆ త‌ర‌వాత వ‌సూళ్లు అనూహ్యంగా డ్రాప్ అయ్యాయి. కొన్ని థియేట‌ర్ల‌లో 20 శాతం ఆక్యుపెన్సీ కూడా క‌నిపించ‌లేదు. ఇంకా బ్రేక్ ఈవెన్ రావ‌ల్సిన ఏరియాలు ఉండ‌డంతో.. ఈ శ‌ని, ఆదివారాల‌పై నిర్మాత‌లు, బ‌య్య‌ర్లు ఆశ‌లు పెట్టుకున్నారు.

 

ఈ వీకెండ్ ఆడ‌వాళ్లు మీకు జోహార్లు, సెబాస్టియ‌న్ సినిమాలు విడుద‌ల‌య‌ల్యాయి. రెండూ ఫ్లాపులే. కాబ‌ట్టి... భీమ్లాకి బెనిఫిట్ జ‌రుగుతుంద‌ని ఆశించారు. అయితే.. ఆ ఆశ‌ల‌న్నీ ఆవిర‌య్యాయి. ఈ శ‌ని, ఆదివారాలు.. బాక్సాఫీసు ద‌గ్గ‌ర భీమ్లా పెద్ద‌గా ప్ర‌భావితం చేయ‌లేక‌పోయింది. ఆడాళ్లు మీకు జోహార్లుకు ఫ్యామిలీస్ త‌ర‌లి రావ‌డంతో, కాస్త సంద‌డి క‌నిపించింది. భీమ్లా థియేట‌ర్లు ఖాళీగా అయిపోయాయి. ఈనెల 11న రాధేశ్యామ్ వ‌స్తోంది. ఈలోగా ఈ మూడు సినిమాలూ త‌ట్టా బుట్టా స‌ర్దేసుకోవాలి. సెబాస్టియ‌న్ ఆల్రెడీ డిజాస్ట‌ర్‌. కాస్త‌లో కాస్త‌.. ఆడ‌వాళ్లునే బెట‌ర్‌. అయితే... ఆడ‌వాళ్లు మీకు జోహార్లు బ‌య్య‌ర్ల‌కు స‌గానికి స‌గం న‌ష్టాన్ని మిగిల్చే అవ‌కాశం ఉంద‌న్న‌ది టాలీవుడ్ టాక్‌.

ALSO READ: రౌడీ కోసం మూడు కోట్లు అడిగిన స‌మంత‌