ENGLISH

రాధే శ్యామ్‌.. అంద‌రూ వేలు పెట్టేవారే?!

07 March 2022-10:32 AM

రాధేశ్యామ్.. దాదాపు మూడేళ్ల నుంచీ సెట్స్‌పైనే ఉంది. చాలా సార్లు విడుద‌ల తేదీ ప్ర‌క‌టించారు. వాయిదా వేశారు. ఎట్ట‌కేల‌కు ఈనెల 11న వ‌స్తోంది. ఈ సినిమాని ఇటీవ‌ల రాజ‌మౌళి, దిల్ రాజు లాంటి సినీ ప్ర‌ముఖులు చూశార్ట‌. రాజ‌మౌళికీ ప్ర‌భాస్‌కీ ఉన్న సంబంధం తెలియంది కాదు. కాబ‌ట్టి.. రాజ‌మౌళి కి సినిమా చూపించి, ఆయ‌న అభిప్రాయాలు తెలుసుకుని, మార్పులూ చేర్పులూ చేయాల‌న్న‌ది చిత్ర‌బృందం ఉద్దేశ్యం. దానికి త‌గ్గ‌ట్టుగానే రాజ‌మౌళి కొన్ని కీల‌క‌మైన మార్పులు సూచించార్ట‌.

 

ఈ సినిమా నైజాం హ‌క్కుల్ని దిల్ రాజు సొంతం చేసుకున్నారు.యూవీతో ఆయ‌న‌కు మంచి అనుబంధం ఉంది. అందుకే దిల్ రాజు సైతం.. ఈ సినిమా చూశార్ట‌. ఆయ‌న కూడా కొన్ని మార్పులు చెప్పార‌ని, ఎడిట్ సూట్‌లో అవ‌న్నీ చ‌క‌చ‌క జ‌రిగిపోయాయ‌ని టాక్‌. ఇది వ‌ర‌కు కూడా `రాధే శ్యామ్` విష‌యంలో చాలా రిపేర్లు జ‌రిగాయి. చాలా సీన్లు రీషూట్ చేశారు. చివ‌రి వ‌ర‌కూ.. ఆ మార్పుల కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. ఎవ‌రెన్ని స‌ల‌హాలూ, సూచన‌లు ఇచ్చినా... ఎన్నిసార్లు మార్పులూ చేర్పులూ చేసినా, ఫైన‌ల్ రిజ‌ల్ట్ బాగుండ‌డం ముఖ్యం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

ALSO READ: రౌడీ కోసం మూడు కోట్లు అడిగిన స‌మంత‌