ENGLISH

రౌడీ కోసం మూడు కోట్లు అడిగిన స‌మంత‌

06 March 2022-12:30 PM

ఇండ‌స్ట్రీలో ఏ స్టార్ హీరోయిన్‌.. పారితోషికం విష‌యంలో త‌గ్గ‌డం లేదు. అంద‌రి నోట నుంచీ రెండు కోట్లూ, మూడు కోట్లూ అనే వినిపిస్తోంది. పూజా హెగ్డే అయితే అంద‌రికంటే టాప్‌. త‌న రెమ్యున‌రేష‌న్ దాదాపుగా రూ.3.5 కోట్లు. ర‌ష్మిక కూడా ఇంచుమించుగా అంతే తీసుకుంటోంది. ఇప్పుడు స‌మంత కూడా ఈ లీగ్‌లో చేరిపోయింది. ఈమ‌ధ్య స‌మంత‌కు కాస్త గ్యాప్ వ‌చ్చినట్టు అనిపించింది. అయితే.. వ‌రుస సినిమాలో తాను మ‌ళ్లీ బిజీ అయిపోయింది. దాంతో పాటు పారితోషికం కూడా అమాంతంగా పెంచేసింది.

 

`పుష్ప‌`లో ఐటెమ్ సాంగ్ చేసింది స‌మంత‌. ఆ పాట కోసం ఏకంగా రూ.1.5 కోట్లు అందుకుంద‌ని టాక్‌. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా కోసం రూ.3.5 కోట్లు డిమాండ్ చేస్తోందట‌. మైత్రీ మూవీస్ సంస్థ‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. శివ నిర్వాణ ద‌ర్శ‌కుడు. ఈ సినిమాలో స‌మంత‌ని క‌థానాయిక‌గా ఎంచుకున్నార‌ని టాక్‌. అందుకోసం రూ.3.5 కోట్ల పారితోషికం కూడా ఇవ్వ‌డానికి రెడీ అయ్యార్ట‌. ఇదో ల‌వ్ స్టోరీ. స‌మంత పాత్ర‌కు చాలా ప్రాధాన్యం ఉంది. అందుకే స‌మంత అడిగినంత ఇచ్చేశార‌ని ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ALSO READ: Samantha Latest Photoshoot