ENGLISH

'భీమ్లా' ఒక‌రోజు ముందే ఎందుకు?

23 March 2022-11:20 AM

ప‌వ‌న్ క‌ల్యాణ్ - రానాల మ‌ల్టీస్టార‌ర్ భీమ్లా నాయ‌క్‌... ఇప్పుడు ఓటీటీల‌లో సంద‌డి చేయ‌బోతోంది. డిస్నీ హాట్ స్టార్ లో గురువారం నుంచే స్ట్రీమింగ్ కానుంది. అయితే నిజానికి ఈనెల 25న ఈ సినిమాని ఓటీటీలో విడుద‌ల చేస్తామ‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. స‌డ‌న్ గా ఓ రోజు ముందే.. అంటే 24నే ఓటీటీలోకి వ‌ద‌దిలేస్తున్నారు. ఒక‌రోజు ముందే ఈ సినిమా రావ‌డానికి కార‌ణం.. ఏమిట‌న్న‌ది అంద‌రిలోనూ ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

 

ఈనెల 25న `ఆర్‌.ఆర్‌.ఆర్‌` విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` వ‌స్తే అంద‌రి దృష్టీ అటువైపే ఉంటుంది. ఓటీటీల‌పై దృష్టి పెట్టేది ఎవ‌రు? అందుకే `భీమ్లా..`ని ఒక రోజు ముందే తీసుకొస్తున్నారు. 24న ఓటీటీలోనూ.. భీమ్లాకి రికార్డ్ వ్యూస్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ఓ అంచ‌నా. ఆ రికార్డు పోగొట్టుకోవ‌డం ఇష్టం లేకే.... ఓ రోజు ముందే ఈ సినిమాని ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. థియేట్రిక‌ల్ వెర్ష‌న్‌కీ, ఓటీటీ వెర్ష‌న్‌కీ ఏమైనా మార్పులు, చేర్పులూ ఉన్నాయా? అనేది మ‌రో డౌటు. సినిమాలో `ఇంత ఇష్ట‌మేంద‌య్యా` పాట లేదు. క‌నీసం ఓటీటీలో అయినా ఉంటుందేమో చూడాలి. ఎడిట్ చేసిన కొన్ని సీన్లు ఓటీటీలో వ‌దిలే అవ‌కాశాలున్నాయి. కొత్త సీన్లు, పాట‌లు ఉంటే... క‌చ్చితంగా వ్యూవ‌ర్ షిప్ పెరుగుతుంది. మ‌రి.. అలాంటి ప్ర‌య‌త్నం ఏమైనా జ‌రిగిందేమో చూడాలి.

ALSO READ: 'ఆర్ఆర్ఆర్' ఎందుకు చూడాలి ?