ENGLISH

వారెవ్వా.. ఏం బిజినెస్సు.. ఇండియాలో ఇదే రికార్డ్‌!

23 March 2022-12:00 PM

విడుద‌లకు ముందే `ఆర్‌.ఆర్‌.ఆర్‌` చ‌రిత్ర సృష్టించింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ భార‌తీయ చిత్రానికీ సొంతం కాని రికార్డు.. ద‌క్కించుకుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ లో ఇదో కొత్త అధ్యాయం.

 

రాజ‌మౌళి - రామ్ చ‌ర‌ణ్ - ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న చిత్రం ఆర్‌.ఆర్‌.ఆర్‌. ఈ శుక్ర‌వారం విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే అడ్వాన్స్ బుకింగుల‌తో హోరెత్తిపోతోంది. విడుద‌ల‌కు నెల రోజుల ముందే... అన్ని ఏరియాల్లోనూ బిజినెస్ పూర్త‌యిపోయింది.ఇప్పుడు ఆలెక్క‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.488 కోట్ల బిజినెస్ జ‌రుపుకుంది. ఏ భార‌తీయ సినిమాకీ సాధ్యం కాని రికార్డ్ ఇది.

 

నైజాంలో ఈ సినిమాని రూ.70 కోట్ల‌కు అమ్మారు. సీడెడ్‌లో రూ.45 కోట్లు ద‌క్కించుకుంది. ఉత్త‌రాంధ్ర రూ.26 కోట్లు ప‌లికింది. క‌ర్నాట‌క నుంచి ఏకంగా రూ.50 కోట్లు వ‌చ్చాయి.నార్త్ మొత్తం క‌లిపి రూ.100 కోట్లు ప‌లికింది. ఓవ‌ర్సీస్ నుంచి 70 కోట్లు వ‌చ్చాయి. అన్ని ఏరియాల్లోనూ రికార్డ్ బిజినెస్ సొంతం చేసుకుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. క‌నీసం 600 కోట్లు వ‌సూలు చేయాలి. అయితే రాజ‌మౌళి టార్గెట్ మాత్రం రూ.1000 కోట్ల‌ని తెలుస్తోంది. సినిమాకి మంచి టాక్ వ‌స్తే రూ.1000 కోట్లు సాధించ‌డం అంత క‌ష్ట‌మేమీ కాదు.

ALSO READ: 'ఆర్ఆర్ఆర్' ఎందుకు చూడాలి ?