ఈ సంక్రాంతికి భీమ్లా నాయక్ విడుదల అవుతుందని అభిమానులంతా గంపెడు ఆశలతో ఎదురు చూస్తున్నారు. అయితే వాళ్లందరికీ చిత్రబృందం షాక్ ఇవ్వబోతోంది. ఈసంక్రాంతికి భీమ్లా నాయక్ రావడం లేదని తెలుస్తోంది. ఈ సినిమాని వాయిదా వేయాలనుకుంటున్నార్ట. ఈరోజు ఈ విషయమై స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. జనవరి 7న `ఆర్.ఆర్.ఆర్` వస్తోంది. దానికి స్పేస్ ఇవ్వడానికి భీమ్లా నాయక్ ని తప్పించాలని చాలారోజుల నుంచి ప్రయత్నాలు సాగుతున్నాయి. కానీ.. భీమ్లా నాయక్ టీమ్ మాత్రం మేం కూడా సంక్రాంతికే వస్తాం అని పట్టుబట్టింది.
అయితే... దిల్ రాజురంగంలోకి దిగి పరిస్థితిని ఓ కొలిక్కి తెచ్చాడని, సితార ఎంటర్టైన్మెంట్స్ తో మాట్లాడి, భీమ్లా నాయక్ ని వాయిదా వేయించాడని తెలుస్తోంది. సంక్రాంతి దాటితే.. భీమ్లా ఎప్పుడు వస్తుందన్నది క్లారిటీ లేదు. బహుశా.. జనవరి 26న రావొచ్చు. లేదంటే ఇక ఫిబ్రవరిలోనే. భీమ్లా తప్పుకుంటే, ఆర్.ఆర్.ఆర్కి ఎదురు లేనట్టే. జనవరి 14న... రాధేశ్యామ్ వస్తుంది. ఈలోగా ఆర్.ఆర్.ఆర్కి ఓ వారం గ్యాప్ ఉంటుంది. అది చాలు.. రికార్డులు హోరెత్తడానికి. కాకపోతే పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయమై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.
ALSO READ: RRR ఈవెంట్లో పవన్ కల్యాణ్ రగడ!