సుకుమార్ - దేవిశ్రీలది అద్భుతమైన కాంబినేషన్. సుకుమార్ సినిమా అంటే.. దేవిశ్రీ ఉండాల్సిందే. నేను శరీరం అయితే, దేవి ఆత్మ అని సుకుమార్ చాలా సందర్భాల్లో చెప్పాడు. దానికి తగినట్టుగానే సుకుమార్ సినిమాకి ప్రత్యేకమైన ఎఫెక్ట్ పెట్టి పాటల్ని కంపోజ్ చేస్తుండేవాడు. పుష్పలోని పాటలన్నీ సూపర్ హిట్. కాకపోతే... ఆర్.ఆర్ విషయంలో ఎవరూ సంతృప్తిగా లేరు. దేవిశ్రీ బీజియమ్స్ సరిగా ఇవ్వలేదని, హీరో ఎలివేషన్లు కుదర్లేదని అభిమానులు వాపోతున్నారు. `అఖండ`లో తమన్ ఇచ్చిన ఎలివేషన్ల ముందు పుష్ప తేలిపోయాడు. దాంతో ఆయా సన్నివేశాల్లో ఉన్న ఎఫెక్ట్ బాగా తగ్గిపోయింది. దాంతో దేవిశ్రీ ఇలా చేశాడేంటి? అని ఫీలైపోతున్నారు ఫ్యాన్స్.
దీనికి ఓ కారణం ఉంది... ఆర్.ఆర్ కోసం దేవి చాలా సమయం తీసుకుంటాడు. కానీ ఈసారి తనకు అంత టైమ్ ఇవ్వలేదని సమాచారం. కేవలం 8 రోజుల్లో ఆర్.ఆర్ పూర్తి చేయాల్సివచ్చిందని తెలుస్తోంది. పైగా సుకుమార్ కూడా.. కొన్ని సీన్లకు అసలు ఆర్.ఆర్ అవసరం లేదని చెప్పాడట. అదో ప్రయోగంలా ఉంటుందని భావించార్ట. చివరికి... ఆ ప్రయోగమే వికటించింది. కొన్ని సీన్లు తేలిపోవడానికి, ఎలివేట్ కాకపోవడానికీ ఆర్.ఆర్ కారణమైంది.
ALSO READ: RRR ఈవెంట్లో పవన్ కల్యాణ్ రగడ!