బిగ్ బాస్ 5 విజేతగా ఆవిర్భవించాడు సన్నీ. తన విజయం ఎవరికీ షాక్ ఇవ్వలేదు. ఎందుకంటే ముందు నుంచీ చాలా సెటిల్డ్ గా ఆడుతూ వచ్చాడు సన్నీ. టైటిల్ కొట్టే అవకాశాలు సన్నీకే మెండుగా ఉన్నాయని విశ్లేషకులు ఊహిస్తూనే ఉన్నారు. చివరికి అదే నిజమైంది. నిజానికి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టేటప్పటికీ సన్నీ గురించి పెద్దగా తెలీదు. ఇప్పుడు సన్నీ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? అనే విషయాల్ని ఆరా తీయడం మొదలెట్టారు.
సన్నీ అసలు పేరు.. అరుణ్ రెడ్డి. 1989లో ఖమ్మంలో పుట్టాడు. తల్లి కళావతి స్టాఫ్ నర్సుగా పనిచేస్తుండేవారు. సన్నీకి ఇద్దరు అన్నయ్యలు ఉజ్వల్, స్పందన్. ఇంటర్ వరకూ ఖమ్మంలోనే చదివాడు. ఆ తరవాత హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో బీ.కామ్ చేశారు. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి. అల్లాదీన్ నాటకానికి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జస్ట్ ఫర్ మెన్ అనే టీవీ షోతో యాంకర్‌గా పరిచయం అయ్యారు. ఏబీఎన్ న్యూస్ ఛానెల్లో రిపోర్టర్‌గా పనిచేశాడు. నటనపై ఆసక్తితో అవకాశాల కోసం ప్రయత్నించాడు సన్నీ. కళ్యాణ వైభోగం అనే టీవీ సీరియల్ ద్వారా నటుడిగా బుల్లితెరపై అడుగుపెట్టాడు. కొన్ని షోలకు యాంకర్‌గా చేశాడు. ఆ గుర్తింపుతోనే బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు. బిగ్ బాస్ టైటిల్ గెలవడంతో రూ.50 లక్షల ప్రైజ్‌మనీ వచ్చింది. దాంతో పాటుగా రూ.25 లక్షల విలువైన ఇంటి స్థలాన్నీ దక్కించుకున్నాడు. తను హీరోగా ఓసినిమా రూపుదిద్దుకుంటోంది. మొత్తానికి ఈ ఖమ్మం కుర్రాడి లైఫ్ సెటిల్ అయిపోయినట్టే.
ALSO READ: RRR ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ రగడ!