ENGLISH

రేపే భీమ్లా హంగామా

22 February 2022-13:30 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో సోమవారం ‘భీమ్లానాయక్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ‘ఈ విషాద సమయంలో ‘భీమ్లా నాయక్‌’ వేడుక చేసుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు. అందుకే సోమవారం జరగాల్సిన విడుదలకి ముందస్తు వేడుకని వాయిదా వేయాలని నిర్ణయించాం’’ అని పవన్‌కల్యాణ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

 

సోమవారం రద్దయిన ఆ వేడుకని రేపు (బుధవారం) నిర్వహించాలని చిత్రబృందం నిర్ణయించింది. యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఈ వేడుక జరగనుంది. తెలంగాణ రాష్ట్రమంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఈ వేడుకకి హాజరు కానున్నారు. సోమవారం విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిత్యమేనన్‌, సంయుక్త మేనన్‌ నాయికలు. దర్శకుడు త్రివిక్రమ్‌ మాటలు, కథనం అందించారు. ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు సమకూర్చారు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ALSO READ: ప్రకాష్ రాజ్ కు రాజ్యసభ ?