ENGLISH

అల్లు అర్హా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది: సమంత

22 February 2022-12:38 PM

''అల్లు అర్హా రాక్‌స్టార్‌ కావడం కోసమే పుట్టింది. చిత్ర పరిశ్రమను ఆమె షేక్ చేస్తుంది'' అని కితాబిచ్చింది సమంత. సమంత టైటిల్ రోల్ లో దర్శకుడు గుణశేఖర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘శాకుంతలం’ మహాభారతంలోని ఆదిపర్వంలో శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా ‘శాకుంతలం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో అల్లు అర్హా చిత్రరంగ ప్రవేశం చేస్తుంది. తాజాగా ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్హా గురించి చెప్పింది సమంత.

 

"అల్లు అర్హా ఒక రాక్‌స్టార్‌. తన గురించి ఏం చెప్పినా తక్కువే అవుతుంది. సెట్‌లో 200-300 మంది ఉన్నప్పటికీ ఎంతో కాన్ఫిడెన్స్ తో యాక్ట్ చేస్తంది. అర్హా ని చూస్తే అద్భుతం అనిపిస్తుంది. తెలుగు చాలా అద్భుతంగా మాట్లాడుతుంది. ఆమె సూపర్ స్టార్ కావడానికి పుట్టింది. అర్హా నాతో అరంగేట్రం చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీలౌతున్నా. అర్హా ఈ పరిశ్రమను షేక్ చేయబోతోంది. శాకుంతలం చూసిన తర్వాత మీరూ నాతో పూర్తిగా ఏకీభవిస్తారు’’ ?అని అర్హ గురించి సమంత చెప్పింది. పాన్ ఇండియా మూవీ గా శాకుంతలం తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.

ALSO READ: ప్రకాష్ రాజ్ కు రాజ్యసభ ?