ENGLISH

'బిగ్‌బాస్‌' ముగింపు అల్టిమేట్‌ సర్‌ప్రైజ్‌

23 September 2017-13:38 PM

బుల్లితెర మెగా గేమ్‌ షో 'బిగ్‌బాస్‌' రేపటితో ముగియనుంది. దాంతో లాస్ట్‌ షోని చాలా గ్రాండ్‌గా ప్లాన్‌ చేశారట. చాలా సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్స్‌ ఉండబోతున్నాయట రేపటి షోలో. ఈ లాస్ట్‌ ఎపిసోడ్‌లో భాగంగా అక్కినేని నాగార్జున గెస్ట్‌గా రానున్నారంటూ గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. మరో పక్క మెగాస్టార్‌ చిరంజీవిని గెస్ట్‌గా తీసుకురానున్నారంటూ వార్తలు వినవస్తున్నాయి. ఇవన్నీ కాదు సూపర్‌ స్టార్‌ మహేష్‌ని తీసుకురానున్నారంటూ మరో పక్క గాసిప్స్‌ చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో నిజమెంతున్నప్పటికీ సర్‌ప్రైజ్‌ అయితే కంపల్సరీ అట. ఈ షోకి మెయిన్‌ అట్రాక్షన్‌ ఎన్టీఆర్‌. ఎన్టీఆర్‌ తనదైన శైలిలో హోస్ట్‌గా వ్యవహరించి, అద్భుతంగా నిర్వహించాడు 'బిగ్‌బాస్‌' షోని. 70 రోజుల పాటు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన 'బిగ్‌బాస్‌' గేమ్‌ షో విన్నర్‌ ఎవరనేదే ఆశక్తికరమైన విషయం. 14 మంది పార్టిసిపెంట్స్‌లో కేవలం ఐదుగురు మాత్రమే ఫినాలేలో మిగిలారు. వారిలో డే ఒన్‌ నుండీ ఉన్నది శివబాలాజీ, అర్చన, హరితేజ , ఆదర్శ్‌ కాగా ఐదవ పార్టిసిపెంట్‌ అయిన నవదీప్‌ వైల్డ్‌ కార్ట్‌ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఐదుగురిలో ఇప్పుడు 'బిగ్‌బాస్‌' టైటిల్‌ని ఎవరు గెలుచుకుంటారనేది రేపటితో తేలనుంది. హోస్ట్‌గా ఎన్టీఆర్‌ వీకెండ్స్‌లో మాత్రమే కనిపించినప్పటికీ, అటు హౌస్‌ మేట్స్‌కీ, ఇటు ఆడియన్స్‌కీ కొత్త జోష్‌నిచ్చేవాడు. వారమంతటికీ సరిపడా ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఎన్టీఆర్‌ ఈ రెండు రోజుల్లోనే పంచేవాడు. టోటల్‌గా ఇన్ని రోజులు అత్యద్భుతంగా 'బిగ్‌బాస్‌'షోని నిర్వహించి ఎన్టీఆర్‌ బుల్లితెర 'బిగ్‌బాస్‌' అయిపోయాడు.

ALSO READ: ఇండియన్ ఆస్కార్ ఎంట్రీ న్యూటన్ మూవీ రివ్యూ & రేటింగ్స్