ENGLISH

బిగ్‌బాస్‌4: ఈక్వేషన్స్‌ అలా మారిపోతున్నాయ్‌!

17 October 2020-09:24 AM

బిగ్‌బాస్‌ రియాల్టీ షోలో ఎప్పటికప్పుడు ఈక్వేషన్స్‌ మారిపోతుంటాయ్‌. ఎవరు స్ట్రాంగెస్ట్‌.? ఎవరు వీకెస్ట్‌.? అనేది రోజువారీ సమీకరణాల్ని బట్టి అటూ ఇటూ అవుతుంటాయి. ఫైనల్‌ వరకూ ఎవరైతే స్ట్రాంగ్‌గా వుంటారో వాళ్ళే విజేతలు. ఒక్కోసారి వీకెస్ట్‌ కంటెస్టెంట్‌కి స్ట్రాంగెస్ట్‌ పాయింట్‌ దొరికేస్తుంటుంది. ఇప్పుడున్న ఈక్వేషన్స్‌ ప్రకారం అబిజీత్‌ టాప్‌ ప్లేస్‌లో వున్నాడు. నిజానికి, సీజన్‌ మొదలైనప్పటినుంచీ అబిజీత్‌కి తిరుగు లేదు. అబిజీత్‌ తర్వాత ఎవరు? అన్నదానిపైనే ఎప్పుడూ చర్చ జరుగుతూ వుండేది.

 

కానీ, ఇప్పుడు ఓ ఐదారుగురు కంటెస్టెంట్స్‌ గురించి చాలా స్ట్రాంగ్‌గా చర్చించుకుంటున్నారు బిగ్‌బాస్‌ వ్యూయర్స్‌. ఆ లిస్ట్‌లో అబిజీత్‌ తర్వాత వినిపిస్తున్న పేరు కుమార్‌ సాయి. ఇది ఆశ్చర్యకరమైన విషయమే. కానీ, అనూహ్యంగా కుమార్‌ సాయి దూసుకొచ్చాడు. కుమార్‌ సాయితో సమానంగా అవినాష్‌కీ ఫాలోయింగ్‌ కనిపిస్తోంది. ఫిమేల్‌ కంటెస్టెంట్స్‌లో దివి సైలెంట్‌ కిల్లర్‌ అని చెప్పొచ్చు. లాస్య, హారిక స్ట్రాంగ్‌ ఫాలోయింగ్‌ వున్నోళ్ళే అయినా, హౌస్‌లో ఆ ఇద్దరి ‘ఎమోషన్స్‌’ ఫేక్‌ అనే ప్రచారం బలపడిపోయింది.

 

ఇక, అరియానా స్ట్రాంగ్‌గానే కనిపిస్తున్నా, ఆమెకు ఆ స్థాయిలో ఫాలోయింగ్‌ మాత్రం రావడంలేదు. అఖిల్‌ విషయానికొస్తే, మోనాల్‌ కారణంగా అతని ఇమేజ్‌ డౌన్‌ అయిపోతోంది. సోహెల్‌, మెహబూబ్‌.. స్ట్రాంగ్‌గా వున్నాసరే, వాళ్ళకి వారి ఆవేశమే ప్రధాన శతృవు. షడెన్‌గా ఈ ఇద్దరి గ్రాఫ్‌ ఎవరూ ఊహించని విధంగా పడిపోతోంది. రాజశేఖర్‌ని ఎవరూ స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా భావించట్లేదు. ఓవరాల్‌గా ఇప్పటికి వున్న ఈక్వేషన్స్‌ ఇవీ.

ALSO READ: ఆ ఉద్దేశ్యం లేదంటున్న శ్రద్ధా కపూర్‌